హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam OTT release date: మూడు వారాలకే ఓటిటిలో ‘రాధే శ్యామ్’.. అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఇదే..

Radhe Shyam OTT release date: మూడు వారాలకే ఓటిటిలో ‘రాధే శ్యామ్’.. అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఇదే..

రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్ డేట్ (radhe shyam)

రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్ డేట్ (radhe shyam)

Radhe Shyam OTT release date: బాహుబలి (Bahubali) తర్వాత వరసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ (Prabhas). అయితే ఆ స్థాయి విజయం మాత్రం అందుకోలేదు ఈయన. మూడేళ్ల కింద వచ్చిన సాహో (Saaho) తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది.

ఇంకా చదవండి ...

Radhe Shyam OTT release date: బాహుబలి (Bahubali) తర్వాత వరసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ (Prabhas). అయితే ఆ స్థాయి విజయం మాత్రం అందుకోలేదు ఈయన. మూడేళ్ల కింద వచ్చిన సాహో (Saaho) తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఇక మొన్న విడుదలైన రాధే శ్యామ్ మాత్రం అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు దారుణమైన నష్టాలు వచ్చాయి. థియెట్రికల్ పరంగా దాదాపు 100 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. విడుదలైన మూడు వారాలకే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీగా వచ్చింది ‘రాధే శ్యామ్’.

మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. మొదటి రోజే టాక్ తేడాగా రావడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. 100 కోట్లకు పైగా షేర్ వచ్చింది కానీ జరిగిన బిజినెస్ 200 కోట్లకు పైగా ఉండటంతో డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. అయితే సినిమాకు ఓ వర్గం నుంచి మాత్రం మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా స్లో గా ఉన్నా కూడా ప్రేమకథలను ఇష్టపడే వాళ్లకు మాత్రం రాధే శ్యామ్ మంచి ఛాయిస్. ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా రాలేదు.

ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. బయ్యర్ల పరిస్థితి ఎలా ఉన్నా కూడా.. నిర్మాతలకు మాత్రం విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా. పెట్టిన బడ్జెట్‌కు అమ్మిన రేట్లకు.. జరిగిన బిజినెస్‌కు వాళ్లకు ఇంకా లాభాలు కూడా వచ్చాయి.

తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు రాధే శ్యామ్ యూనిట్. ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మ్యాజికల్ లవ్ జర్నీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసారు. అమెజాన్‌లో ఈ ప్రేమకథను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని.. ఎప్రిల్ 1 నుంచి కచ్చితంగా అంతా రాధే శ్యామ్‌తో ప్రేమలో పడిపోతారని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు. మరి థియేటర్స్‌లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటిటిలో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

First published:

Tags: Amazon prime, Prabhas, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు