Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం (Radhe Shyam) రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో వీడియోను విడుదల చేసింది టీమ్. ఈ సరికొత్త (Radhe Shyam) ట్రైలర్లో.. మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి అంటూ (Prabhas) ప్రభాస్ వాయిస్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అంటూ పూజా హెగ్డే పలికే డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్స్‌ను చూస్తుంటే... సినిమా విజువల్ వండర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నారు. పిరియాడికల్ లవ్‌స్టోరిగా వస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు ఇక్కడి సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా హిందీకి మాత్రం సచిత్ బల్హరా, అంకిత్ బల్హరా, మితున్, అమల్ మాలీక్, మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.
ప్రమోషన్లో భాగంగా ఈ (Radhe Shyam) చిత్రానికి సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఇప్పటికే భారీగా జరిపింది టీమ్. ఈ ఈవెంట్‌ను డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను గత నవంబర్ 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్ నగుమోము తారలే కూడా చిత్రబృందం విడుదల చేసింది చిత్రబృందం. ఇక మూడో సాంగ్ “సంచారి పాటను కూడా రిలీజ్ చేసింది. ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.
Love. Destiny. Action. Presenting the curtain raiser video of #RadheShyam ?#RadheShyamReleaseTrailer
Telugu: https://t.co/0wcaSxPEMF
Hindi: https://t.co/hLmrZ0U5dr
Tamil: https://t.co/lcwKZvBBLs
Kannada: https://t.co/lvEDMuveLy
Malayalam: https://t.co/o5nZuFZuPC pic.twitter.com/vrvwtymkR0
— BA Raju's Team (@baraju_SuperHit) March 2, 2022
ఇక 'సాహో' తరువాత (Prabhas ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. దీనికి తోడు వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Bheemla Nayak top 15 dialogues: త్రివిక్రమ్ పెన్ పవర్.. ‘భీమ్లా నాయక్’లో టాప్ 15 డైలాగులు ఇవే..
ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spririt) అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Radhe Shyam, Tollywood news