Home /News /movies /

PRABHAS POOJA HEGDE RADHAKRISHNA NEW MOVIE GEORGIA SCHEDULED WRAPEED UP TA

ప్రభాస్ జార్జియా షెడ్యూల్ పూర్తి.. ఉగాదికి టైటిల్ అనౌన్స్‌మెంట్..

మొన్నటి వరకు అభిమానులు మా వాడు సినిమాకు 40 కోట్లు తీసుకున్నారు.. 50 కోట్లు తీసుకున్నారు అంటూ హీరోలు గొప్పగా చెప్పుకునే వాళ్లు. ఎవరెన్ని తీసుకున్నా కూడా ఇండియాలో రజినీకాంత్ తర్వాతే ఎవరైనా.

మొన్నటి వరకు అభిమానులు మా వాడు సినిమాకు 40 కోట్లు తీసుకున్నారు.. 50 కోట్లు తీసుకున్నారు అంటూ హీరోలు గొప్పగా చెప్పుకునే వాళ్లు. ఎవరెన్ని తీసుకున్నా కూడా ఇండియాలో రజినీకాంత్ తర్వాతే ఎవరైనా.

Prabhas 20| బాహబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అతడి సినిమాలకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన జార్జియా షెడ్యూల్ కంప్లీటైంది.

ఇంకా చదవండి ...
    Prabhas 20 | బాహబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అతడి సినిమాలకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ ప్రేక్షకులను అలరించినపోయినా.. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.  ఒక్క హిందీలోనే ఈ సినిమాకు రూ. 200 కోట్ల వరకు కొల్లగొట్టింది. ప్రస్తుతం  ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాాజాగా ఈ సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్ కంప్లీటైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించాడు. జార్జియన్‌ల సహాయంతో ఈ షెడ్యూల్ త్వరగా పూర్తైయిందన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.



    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు అదే రోజు టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు ‘రాధేశ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే పేర్లు అనుకుంటున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అన్ని భాషల్లో కలిపి ఒకటే పెట్టాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.  మొత్తానికి ఈ రెండిటిలో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్.. దాంతో పాటు మరో కొత్త చిత్రాన్ని అదే రోజు అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood, Pooja Hegde, Prabhas, Prabhas20, Radha Krishna, Tollywood, UV Creations

    తదుపరి వార్తలు