హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam story leaked: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ లీక్.. బయటికి వచ్చేసిన మెయిన్ థీమ్..

Radhe Shyam story leaked: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ లీక్.. బయటికి వచ్చేసిన మెయిన్ థీమ్..

రాధే శ్యామ్‌లో ప్రభాస్ పూజా హెగ్డే (Instagram/Photo)

రాధే శ్యామ్‌లో ప్రభాస్ పూజా హెగ్డే (Instagram/Photo)

Radhe Shyam story leaked: ఈ రోజుల్లో సినిమాలు చేయడం కంటే చేసిన సినిమాకు సంబంధించిన కథన లీక్ కాకుండా చూసుకోవడం పెద్ద రిస్క్. తాజాగా ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్(Radhe Shyam) సినిమాకు కూడా ఇలాంటి తిప్పలే వచ్చాయి. ఈ చిత్ర కథ బయటికి వచ్చేసింది.

ఇంకా చదవండి ...

ఈ రోజుల్లో సినిమాలు చేయడం కంటే చేసిన సినిమాకు సంబంధించిన కథన లీక్ కాకుండా చూసుకోవడం పెద్ద రిస్క్. అలాగే విడుదలకు ముందు ఆన్‌లైన్‌లోనే లీక్ కాకుండా ఆపడం అనేది మరో పెద్ద తలనొప్పి. ఇక విడుదలైన తర్వాత పైరసీని అడ్డుకోవడం అనేది ఎవరి తరం కావడం లేదు. ఎన్ని యాంటీ పైరసీ సెల్స్ పెట్టినా కూడా అది జరగడం లేదు. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు కూడా ఇలాంటి తిప్పలే వచ్చాయి. ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కావడంతో అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ తాజాగా ఈ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ లైన్ హంగామా చేస్తుంది.

విడుదలైన పోస్టర్స్.. బయటికి వచ్చిన టీజర్ చూస్తుంటే ఈ కథ కరెక్టే అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. రాధే శ్యామ్ మెయిన్ థీమ్ లైన్ లీక్ అయింది. ఇందులో పూజా హెగ్డే మెడికోగా నటిస్తున్నారు.

prabhas,prabhas instagram,prabhas Radhe Shyam story leaked,prabhas pooja hegde,prabhas pooja hegde radhe shyam romance,prabhas radhe shyam movie story leaks,radha krishna kumar prabhas radhe shyam movie,telugu cinema,రాధే శ్యామ్ కథ లీక్,ప్రభాస్ రాధే శ్యామ్ కథ లీక్,ప్రభాస్ పూజా హెగ్డే రాధే శ్యామ్
రాధే శ్యామ్‌లో ప్రభాస్ పూజా హెగ్డే (Instagram/Photo)

1960ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో ఓ హాస్పిటల్‌లో పూజా హెగ్డే పని చేస్తున్నప్పుడు యాక్సిడెంట్‌లో గాయాల పాలైన విక్రమాదిత్యను అక్కడికి తీసుకొస్తారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్ అన్నమాట. ఇందులో ప్రేరణ పాత్రలో పూజా.. విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తున్నారు. ఆస్పత్రిలో ఆమె సేవలు.. మనసును చూసి పడిపోతాడు ప్రభాస్. అక్కడ్నుంచి తన ప్రేమను ప్రేరణ నుంచి ఎలా పొందాడు అనేది అసలు కథ. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే సన్నివేశాలను చాలా అద్భుతంగా దర్శకుడు రాసుకున్నాడని తెలుస్తుంది.

prabhas,prabhas instagram,prabhas Radhe Shyam story leaked,prabhas pooja hegde,prabhas pooja hegde radhe shyam romance,prabhas radhe shyam movie story leaks,radha krishna kumar prabhas radhe shyam movie,telugu cinema,రాధే శ్యామ్ కథ లీక్,ప్రభాస్ రాధే శ్యామ్ కథ లీక్,ప్రభాస్ పూజా హెగ్డే రాధే శ్యామ్
ప్రభాస్ (Twitter/UV Creations/Photo)

వినడానికి రొటీన్ కథగానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఏ దర్శకుడు చూపించనంత అందంగా, రొమాంటిక్‌గా రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాలో చూపిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా జులై 30న విడుదల అవుతుందని ప్రకటించినా ఇప్పుడు కరోనా కారణంగా ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు