వాయిదా పడ్డ ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్... కారణాలు అదేనా..

ప్రస్తుతం ప్రభాస్... ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో  ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

news18-telugu
Updated: November 20, 2019, 12:45 PM IST
వాయిదా పడ్డ ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్... కారణాలు అదేనా..
ప్రభాస్ (File photo)
  • Share this:
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. ఈ చిత్రం తర్వాత ప్యాన్ ఇండియా చిత్రంగా ‘సాహో’ చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయినా.. కళ్లు చెదిరే కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.కేవలం హిందీలోనే ఈ సినిమా రూ.200 కోట్లు కలెక్ట్ చేయడంతో హీరోగా ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్... ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో  ఒక సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను 1970-80 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్కుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగానే తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్,పూజా హెగ్డే (Instagram/Photo)


ఐతే.. ప్రభాస్ సాహో చిత్ర ప్రమోషన్స్ తర్వాత వెకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాడు. ఆ తర్వాత బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ కోసం లండన్ కూడా వెళ్లాడు. ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలను తెరకెక్కించిన చిత్ర దర్శకుడు ఇపుడు ప్రభాస్ ఉన్న సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ముందుగా ఈ సినిమాను పూర్తిగా యూరప్‌లో తీద్దామనుకున్న బడ్జెట్‌ కంట్రోల్‌లో భాగంగా ఇక్కడే సెట్ వేసి చిత్రీకరించే ప్లాన్‌లో ఉన్నారు చిత్ర నిర్మాతలు. ఈ గ్యాప్‌లోనే ప్రభాస్... కాస్తంత బరువు పెరిగాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అందుకే ఒక నెల ఈ సినిమా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి ప్రభాస్ తన బరువు తగ్గించుకునే పనిలో పడ్డాడు. దీంతో ఈ సినిమాకు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 20, 2019, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading