Prabhas-Pooja Hegde: ఇటలీలో ప్రభాస్ పూజా హెగ్డే రొమాన్స్.. పదిహేను రోజులు అక్కడే..

Prabhas : 'సాహో, లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'.

news18-telugu
Updated: September 24, 2020, 6:57 AM IST
Prabhas-Pooja Hegde: ఇటలీలో ప్రభాస్ పూజా హెగ్డే రొమాన్స్.. పదిహేను రోజులు అక్కడే..
ప్రభాస్, పూజా హెగ్డే Photo : Twitter
  • Share this:
'సాహో, లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. పిరియాడిక్ లవ్ స్టోరి జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న.. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. లేట్‌గా వచ్చిన సరే.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించింది. ఇక మొదటి నుండి ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏమైఉంటుందని.. చాలా ఆసక్తిగా ఉన్నారు పూజా హెగ్డే అభిమానులు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉంటుందట. ఇప్పటికే ఆమె లుక్ పై చాలా రూమర్స్ వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఆమె ఫస్ట్ లుక్ విడుదల వరకు వేయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా మరో రేంజ్‌లో ఉండే విధంగా ప్లాన్ చేశాడట దర్శకుడు రాధా కృష్ణ.

దాదాపు పూర్తి కావోచ్చిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆరు నెలల విరామం తర్వాత ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. 'రాధేశ్యామ్‌' షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టనుంది చిత్రబృందం. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ మొదటివారంలో పునఃప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కీలక షెడ్యూల్‌ కోసం చిత్రబృందం ఇటలీ దేశానికి పయనం కానున్నట్లు చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డేతో కీలక సన్నివేశాలను ఓ పాటను చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది. గోపీకృష్ణమూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట.

ఈ చిత్రానికి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉండటంతో మొదట సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకుంటున్నారని గతంలో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పేరు తెరపైకొచ్చింది. రెహమాన్ ఇటీవల కాలంలో తెలుగులో ఏ సినిమా చేయలేదు. అంతేకాదు ఆయన ఒక తమిళ్‌లో తప్ప ఏ భాషాల్లోను ఎక్కువుగా సంగీతం అందిచట్లేదు. ఆయన చేసిన చివరి హిందీ సినిమా. దిల్ బెచారా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆఖరి చిత్రానికి రెహమాన్ బాణీలు సమకూర్చగా.. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నాగ్ అశ్విన్ తన సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. రెహమాన్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అయినా.. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ దక్కుతుందనే నమ్మకంతో చిత్రబృందం కూడా ఉన్నట్టు సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: September 24, 2020, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading