PRABHAS POOJA HEGDE BIGGEST LOVE STORY RADHE SHYAM MOVIE POSTPONED DUE TO THE INCREASE OF OMICRON CASES IN INDIA AND NEW DATE ANNOUNCED SOON PK
Radhe Shyam movie postpone: ‘రాధే శ్యామ్’ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
రాధే శ్యామ్ రిలీజ్ వాయిదా (Radhe Shyam)
Radhe Shyam movie postpone: సంక్రాంతికి మరో బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. మరో భారీ సినిమా కూడా వాయిదా పడిపోయింది. ఇన్ని రోజులు కచ్చితంగా వస్తామని చెప్పిన రాధే శ్యామ్ (Radhe Shyam movie postpone) నిర్మాతలు.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
సంక్రాంతికి మరో బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. మరో భారీ సినిమా కూడా వాయిదా పడిపోయింది. ఇన్ని రోజులు కచ్చితంగా వస్తామని చెప్పిన రాధే శ్యామ్ నిర్మాతలు.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులను చూసి వాళ్లు వెనకడుగు వేయక తప్పలేదు. జనవరి 14న విడుదల కావాల్సిన సినిమా నిరవధిక వాయిదా పడింది. మరో మంచి తేదీని చూసుకుని వస్తామని అధికారికంగా ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ట్రిపుల్ ఆర్ రాకపోయినా కూడా కనీసం రాధే శ్యామ్ సినిమాతో అయినా పండగ చేసుకుందామని వేచి చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ప్రభాస్ కూడా తప్పుకోవడంతో ఈ సంక్రాంతి అంతా పూర్తిగా చిన్న సినిమాలతోనే కానిచ్చేయక తప్పదు. కేవలం బంగార్రాజు మాత్రమే రేసులో ఉందిప్పుడు.
మా సినిమాను విడుదల చేయడానికి చివరి నిమిషం వరకు చాలా ప్రయత్నించాం.. కానీ ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులు.. పెరిగిపోతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నామంటూ ట్వీట్ చేసింది రాధే శ్యామ్ చిత్రయూనిట్.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support.
విధి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర కథ. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న లవ్ స్టోరీ ఇది. ఇలాంటి సినిమాను ఈ పరిస్థితుల్లో థియేటర్స్‌లో విడుదల చేయడం సరైంది కాదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే మరో డేట్ చూసుకుని వస్తామని చెప్పారు నిర్మాతలు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.