PRABHAS OWN DUBBING TO SAAHO HINDI VERSION HERE ARE THE DETAILS TA
బాలయ్య, నాగ్, మహేష్ బాటలో ఆ పని కానిచేస్తోన్న ప్రభాస్..
బాలకృష్ణ,నాగార్జున,మహేష్ బాబు,ప్రభాస్
గత కొన్నేళ్లుగా మన హీరోలు..ఒక భాషకే పరిమతం కాకుండా అన్ని భాషల్లో తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. తాజాగా ఈ సినిమా కోసం బాలకృష్ణ,నాగార్జున,మహేష్ బాబులు చేసిన పనినే సాహో కోసం ప్రభాస్ చేయనున్నాడు. ఇంతకీ వివరాల్లోకి వెళితే..
గత కొన్నేళ్లుగా మన హీరోలు..ఒక భాషకే పరిమతం కాకుండా అన్ని భాషల్లో తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. తాజాగా ఈ సినిమా కోసం బాలకృష్ణ,నాగార్జున,మహేష్ బాబులు చేసిన పనినే సాహో కోసం ప్రభాస్ చేయనున్నాడు. ఇంతకీ వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ మూవీని ఒకేసారి తెలుగుతో పాటు హిందీ,తమిళంలో చేస్తున్నాడు. ఏదో హిందీలో సినిమా చేస్తున్నా అని కాకుండా అక్కడివాళ్లకు కనెక్ట్ కానీకి హిందీతో పాటు ఇతర భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే నాగార్జున తమిళం, తెలుుగులో నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్లో నాగార్జున తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇక ఇదే సినిమాలో యాక్ట్ చేసిన మరో హీరో కార్తి కూడా తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కార్తి తెలుగులో డబ్ అయిన ప్రతి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక కార్తి రూట్లో వాళ్ల అన్న సూర్య కూడా తెలుగులో రిలీజైన ‘గ్యాంగ్’ డబ్బింగ్ సినిమాలో తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అంతకు ముందు కమల్ హాసన్, రజినీకాంత్..కెరీర్ మొదట్లో తెలుగు,హిందీ వంటి సినిమాల్లో తమ క్యారెక్టర్‌కు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు.
ప్రభాస్ ఫైల్ ఫోటో
ఇక మహేష్ బాబు ఫస్ట్ టైమ్..‘స్పైడర్’ తమిళ వెర్షన్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అటు బాలకృష్ణ కూడా ‘శ్రీరామరాజ్యం’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఆయనే మాటలు చెప్పుకున్నాడు. ఇపుడు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’‘ఎన్టీఆర్ మహానాయకుడు’ డబ్బింగ్ వెర్షన్స్‌కు బాలయ్యే హిందీలో ఓన్ డబ్బింగ్ చెప్పినట్టు సమాాచారం. ఇక వీళ్ల బాటలోనే ప్రభాస్ కూడా ‘సాహో’ హిందీ వెర్షన్‌కు ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్నట్టు సమాచారం.ఏదో సినిమా చేసినట్టు కాకుండా అక్కడి ఫీల్ రావడానికి ప్రభాస్..‘సాహో’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. ఇక ప్రబాస్‌కు హిందీ వచ్చినా..అందులో ఎక్కువ సౌత్ యాస్ ఉంటుందట. అందుకే నార్త్ యాస కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ‘సాహో’ కోసం ప్రభాస్ ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకోవడం అభినందించాల్సిన విషయమే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.