హిందీ సినిమా కోసం అన్నంత పనిచేసిన ప్రభాస్..

అవును ప్రభాస్.. హిందీ సినిమ ా కోసం అన్నంత పని చేసాడు. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 13, 2019, 3:30 PM IST
హిందీ సినిమా కోసం అన్నంత పనిచేసిన ప్రభాస్..
ప్రభాస్ సాహో పోస్టర్
  • Share this:
అవును ప్రభాస్.. హిందీ సినిమ ా కోసం అన్నంత పని చేసాడు. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వివరాల్లోకి వెళితే..గత కొన్నేళ్లుగా మన హీరోలు..ఒక భాషకే పరిమతం కాకుండా అన్ని భాషల్లో తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. తాజాగా ప్రభాస్ ‘సాహో’ మూవీని ఒకేసారి తెలుగుతో పాటు హిందీ,తమిళం,మలయాళంలో తెరకెక్కించాడు.  అంతేకాదు ఒకేసారి నాలుగు భాషలకు సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేసారు. ఇక తమిళం, మలయాళంలో ప్రభాస్ పాత్రకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. కానీ ‘సాహో’ హిందీ వెర్షన్‌కు మాత్రం ప్రభాస్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో ‘బాహుబలి’ సినిమా హిందీ వెర్షన్ అపుడే తన నెక్ట్స్ సినిమా వరకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఇపుడు ‘సాహో’ హిందీ వెర్షన్ కోసం తన పాత్రకు తానే డబ్బింగ్  చెప్పుకున్నాడు.తాజాగా రిలీజైన ‘సాహో’ టీజర్‌లో తిప్పి కొడితే ప్రభాస్.. మూడంటే మూడు డైలాగులు చెప్పడం అభిమానులను ఒకింత నిరుత్సాహానికి గురిచేసినా... ‘సాహో’ హిందీ వెర్షన్‌లో తన డైలాగులు ఎలా చెప్పడా అని ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమైనా ప్రభాస్  హిందీలో సినిమా రిలీజ్ చేయడమే కాదు..అక్కడివాళ్లకు కనెక్ట్ కానీకి హిందీలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం శుభపరిణామం అనే చెప్పాలి.First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు