అల్లు ‘రామాయణం’లో శ్రీరామచంద్రుడు ఇతడేనా..

అల్లు అరవింద్ రామాయణం (పైల్ ఫోటో)

ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్న తనవీ తీరని కావ్యం రామాయణం. ఈ ఇతిహాసం గురించి ఇప్పుడు కొత్త‌గా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ ఎన్నిసార్లు చూసినా.. చ‌దివినా త‌నివి తీర‌ని మ‌హాకావ్యం రామాయ‌ణం. తాజాగా అల్లు అరవింద్.. భారీ బడ్జెట్‌తో దేశంలోని అన్ని భాషల్లో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాలో శ్రీరాముడిగా పలువురు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారు.

 • Share this:
  ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్న తనవీ తీరని కావ్యం రామాయణం. ఈ ఇతిహాసం గురించి ఇప్పుడు కొత్త‌గా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ ఎన్నిసార్లు చూసినా.. చ‌దివినా త‌నివి తీర‌ని మ‌హాకావ్యం రామాయ‌ణం. రాముడి గాథ‌.. ఆయ‌న జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మే. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నిసార్లు రామాయ‌ణ గాథ చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇలాంటి భారీ ప్ర‌యోగానికి రంగం సిద్ధం అవుతోంది. తెలుగులో భారీ సినిమాల‌కు ఎప్పుడూ పెట్టింది పేరు అల్లు అర‌వింద్. తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో దాదాపు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు పార్టులతో ‘రామాయణం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాలో రాముడిగా ముందుగా రామ్  చరణ్‌ను అనుకున్నా.. రామ్ చరణ్ మాత్రం శ్రీరాముడిగా నటించడానికి విముఖత చూపిస్తున్నాడు.

  prabhas or hrithik roshan will play sri rama character and jr ntr to play ravana character in allu aravind 3d ramayana movie worth 1500 crore budget with 3 parts in many languages
  శ్రీరాముడి పాత్రలో రామ్ చరణ్ (ఫైల్ ఫోటోస్)


  మరోవైపు ఈ సినిమాలో రాముడి తర్వాత అత్యంత ప్రాధాన్యత కూడుకున్న రావణాసురుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను అనుకుంటున్నారు. మరి తారక్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. మరోవైపు ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ పేరును పరీశీలిస్తున్నారు.

  prabhas or hrithik roshan will play sri rama character and jr ntr to play ravana character in allu aravind 3d ramayana movie worth 1500 crore budget with 3 parts in many languages
  శ్రీరామ చంద్రుడిగా హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్న యూనిట్ (ఫైల్ ఫోటోస్)


  అతను కాకపోతే.. ప్రభాస్ పేరును రాముడి పాత్రకోసం అనుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా నటులకు సంబంధించిన స్కెచెస్ రెడీ చేయిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ విషయమై బీటౌన్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించిన నయనతారను మరోసారి ఈసినిమాలో సీత పాత్ర కోసం అనుకుంటున్నారు. ఈ భారీ పౌరాణిక చిత్రంలో అన్ని భాషలకు చెందిన నటీనటులను తీసుకొని తెరకెక్కిస్తే ప్యాన్ ఇండియా మూవీగా ఈ  సినిమాపై క్రేజ్ పెరగడం ఖాయం అంటున్నారు.

  prabhas or hrithik roshan will play sri rama character and jr ntr to play ravana character in allu aravind 3d ramayana movie worth 1500 crore budget with 3 parts in many languages
  శ్రీరాముడిగా ప్రభాస్ పేరును పరిశీలిస్తున్న యూనిట్ (పైల్ ఫోటోస్)


  అత్యంత భారీ సాంకేతికతో తెరకెక్కుతోన్నఈ సినిమాను మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా అనే మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణం సినిమాను 3డిలో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించ‌బోతున్నారు.2021లో తొలి భాగం విడుద‌ల కానుంది. ఈ సినిమాను దంగల్ ఫేమ్ నితిష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్‌తో డైరెక్ట్ చేయనున్నారు.
  First published: