హీరో ప్రభాస్ మొదటి నుంచి కొన్ని విషయాలను అసలు పట్టించుకోడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనను పొడుడుతున్న ట్రోల్ చేస్తోన్న వాటిని అంతగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు నిలయం. కానీ ప్రభాస్ మాత్రం వాటిని అంతగా పట్టించుకున్నట దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పేరుతో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి అభిమానులు నిరాశ చెందారు. రొటీన్ పోస్టర్ అంటూ కామెంట్స్ వినబడ్డాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది.
ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటి దీపికా పదుకొనేను తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా కోసం దీపికాకు అత్యధిక పారితోషకం ఆఫర్ కూడా చేసారు. దీంతో దీపికా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పింది. కానీ ఈ సినిమా దీపికా పేరు వినిపించినప్పటి నుంచి ఆమె పేరు హైలెట్ అవుతుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. మరోవైపు ప్రభాస్ సరసన దీపికా కాకుండా.. ఎవరైనా సౌత్ హీరోయిన్ నటించినా ఈ సినిమా కున్న క్రేజ్ తగ్గదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా దీపికా ఎంపికపై కొంత మంది బ్యాడ్ సెంటిమెంట్ అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్.. గత సినిమా ’సాహో’లో హిందీ భామ.. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్నిఅందుకోలేదు. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ సరసన బీ టౌన్ బ్యూటీ కంగనా రనౌత్ నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో బాలీవుడ్ భామలు యాక్ట్ చేస్తే ఆ సినిమాలు సరిగా నడవలేదు. అందుకే ఇపుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటిస్తోంది. దీంతో బ్యాడ్ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎక్కడ ఫ్లాప్ అవుతుందా అని ఆందోళన చెందుతున్నారు. దీనిపై యంగ్ రెబల్ అంతగా స్పందించకుండా.. స్టోరీ బాగుంటే ఇలాంటి సెంటిమెంట్స్ ఏమి చేయవంటున్నారు మరికొంత మంది ఫ్యాన్స్. ఏమైనా చేసే సినిమా కథలో దమ్ము ఉండాలి కానీ ఈ సెంటిమెంట్ అనేవి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Deepika Padukone, Nag Ashwin, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood