కొత్త సినిమా కోసం సెంటిమెంట్స్ పక్కన పెట్టిన ప్రభాస్..

సినిమా ఇండస్ట్రీ అంటే సెంటిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఒకసారి ఒక ముద్ర పడిందంటే దాని నుంచి బయట పడటం అంత తేలిక కాదు. ఇక ప్రభాస్ కూడా ‘సాహో’ తర్వాత చేయబోతున్న కొత్త సినిమా కోసం సెంటిమెంట్స్ పక్కన పెట్టినట్టు సమాచారం.

news18-telugu
Updated: January 22, 2020, 9:07 AM IST
కొత్త సినిమా కోసం సెంటిమెంట్స్ పక్కన పెట్టిన ప్రభాస్..
ప్రభాస్ కొత్త సినిమా లుక్ (Intstagram/Photo)
  • Share this:
సినిమా ఇండస్ట్రీ అంటే సెంటిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఒకసారి ఒక ముద్ర పడిందంటే దాని నుంచి బయట పడటం అంత తేలిక కాదు. ఇక ప్రభాస్ కూడా ‘సాహో’ తర్వాత చేయబోతున్న కొత్త సినిమా కోసం సెంటిమెంట్స్ పక్కన పెట్టినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి గోపికృష్ణా మూవీస్‌ బ్యానర్‌లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నిర్మస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ప్రభాస్ సెంటిమెంట్స్ పక్కన పెట్టినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం ప్రభాస్.. పెదనాన్న ఎంతో కష్టపడి ఒప్పించినట్టు సమాచారం. అభిమానుల ముచ్చట తీర్చడం కోసమే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో ప్రభాస్, కృష్ణంరాజు నటించిన ‘బిల్లా’, ‘రెబల్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ప్రభాస్, కృష్ణంరాజు మళ్లీ నటిస్తే.. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా ఫ్లాప్ అవుతుందన్న విషయాన్ని ప్రభాస్‌‌‌కు ఆయన సన్నిహితులు గుర్తు చేసారట.

పెదనాన్నతో ప్రభాస్ (Twitter/Photo)


కానీ ప్రభాస్ మాత్రం అవన్ని పట్టించుకోకుండా పెదనాన్న కృష్ణంరాజును  తన కొత్త సినిమాలో నటింపచేయనున్నట్టు సమాచారం. మొత్తానికి సెంటిమెంట్ పక్కనపెట్టి ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా హిట్టైయి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు