బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హీరోగా ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ ఎత్తున నిర్మించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాను సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం.
హీరోగా ప్రభాస్.. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ బ్యానర్‌లో మూడు తరాలకు చెందిన టాలీవుడ్ అగ్ర కథానాయకులందరు నటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రభాస్.. ప్రతిష్ఠాత్మకమైన ఈ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నాడు. గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు.. ‘అడివి సింహాలు’ సినిమాలో యాక్ట్ చేసాడు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మరో హీరోగా కృష్ణ కూడా నటించారు. తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తుండటం విశేషం. మహానటి, దేవదాస్, మహర్షి చిత్రాల తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ సినిమాలో యాక్ట్ చేసే నటీనటుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభాస్.. కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వెంకీ కుడుముల వంటి దర్శకులను కూడా లైన్‌లో పెట్టాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashwini Dutt, Nag Ashwin, Prabhas, Prabhas 21, Telugu Cinema, Tollywood, Vyjayanthi Movies