నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్..

బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హీరోగా ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. తాజాగా ప్రభాస్..నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రబాస్ ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 18, 2020, 8:14 PM IST
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్..
ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హీరోగా ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటైనట్టు సమాచారం. దీంతో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక మూవీకి ఓకే చెప్పాడు. దాంతో పాటు ప్రభాస్.. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పాడనేది టాక్. ఇప్పటికే నాగ్ అశ్విన్.. ప్రభాస్‌ను కలిసి కథను వినిపించాడట. ప్రభాస్ కూడా ఈ లైన్‌ను డెవలప్ ప్యాన్ ఇండియా లెవల్‌కు సరిపడా స్క్రిప్ట్‌ను  చేయమని నాగ్ అశ్విన్‌కు కొన్ని మార్పులు చేర్పులు  చెప్పాడట. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్‌లోతెరకెక్కబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ మూవీ ?


నాగ్ అశ్విన్ కూడా ‘మహానటి’ తర్వాత ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఈ సమయంలోనే ఒకటికి రెండు స్క్రిప్ట్‌లు రెడీ చేసుకున్నాడు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్‌లను కలిసి కథలను వినిపించాడు. వీళ్లెవరు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌కు ఔననలేదు. కాదనలేదు. దీంతో ఇపుడు ప్రభాస్‌ను కలిసి కథ వినిపించాడు. మరి ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్‌ చెప్పిన కథకు ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు