ప్రభాస్ నిజంగానే ఆ సాహసం చేస్తాడా.. సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా..

ప్రభాస్ నిజంగానే ఆ సాహసం చేస్తాడా.. చేసి సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 20, 2019, 6:43 AM IST
ప్రభాస్ నిజంగానే ఆ సాహసం చేస్తాడా.. సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా..
ప్రభాస్ సాహో ఫోటో
  • Share this:
ప్రభాస్ నిజంగానే ఆ సాహసం చేస్తాడా.. చేసి సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే..దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వ శాఖలో పనిచేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ తర్వాత దర్శకులయ్యారు. కానీ ఎవరు డైరెక్టర్‌గా సక్సెస్ కాలేకపోయారు.

ఇక రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన కృష్ణ అనే అసిస్టెంట్ డైరెక్టర్ త్వరలో మెగాఫోన్ పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు ప్రభాస్‌ను కలిసి అతని తగ్గ కథను వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్రభాస్..ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత పట్టాలెక్కించే అవకాశం ఉంది.

ప్రజెంట్ ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక ప్రేమకథ చిత్రం చేస్తున్నాడు. ఈ సినమాను 1970,80 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాజమౌళి అసిస్టెంట్ కృష్ణ సినిమా పట్టాలెక్కేఅవకాశం ఉంది.

ఇప్పటికే ప్రభాస్.. రాజమౌళి అసిస్టెంట్ కృష్ణతో పాటు మరోవైపు కే.జీ.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి రాజమౌళి దగ్గర పనిచేసిన ఏ దర్శకుడు హిట్టు అందుకోలేకపోయారు. త్వరలో ప్రభాస్‌తో చేయబోయే సినిమాతోనైనా కృష్ణ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి రాజమౌళి పేరు నిలబెడతాడా  లేదా అనేది చూడాలి. 

 
First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>