news18-telugu
Updated: March 1, 2020, 11:30 AM IST
ప్రభాస్, దీపికా పదుకొనే Photo : Twitter
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలైనట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. చందమామ కథలాంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట. ఈ ఏడాది చివర్లో సినిమా లాంచ్ చేసి వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ అప్పట్లో మహానటి విడుదల సమయంలోనే పాతాళ భైరవి తరహాలో ఓ సినిమా అనుకుంటున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్తో చేయబోయే సినిమాకు అలాంటి కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
Published by:
Suresh Rachamalla
First published:
March 1, 2020, 11:28 AM IST