#Prabhas21 : ప్రభాస్ సరసన దీపికా.. అధికారిక ప్రకటన

#Prabhas21 : మహానటితో సూపర్ పాపులర్ అయినా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. ఈ మూవీ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

news18-telugu
Updated: July 19, 2020, 12:07 PM IST
#Prabhas21 : ప్రభాస్ సరసన దీపికా.. అధికారిక ప్రకటన
ప్రభాస్, దీపికా Photo : Twitter
  • Share this:
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే పేరుతో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది.  ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటి దీపికా పదుకొనేను తీసుకున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది.

nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,deepika padukone,prabhas movie,prabhas action,deepika padukone prabhas,deepika padukone movies,deepika padukone new movie,baahubali prabhas,ప్రభాస్, దీపికా పదుకొనే
ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter


ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నరాధేశ్యామ్ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. చందమామ కథలాంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట.

ఈ ఏడాది చివర్లో సినిమా లాంచ్ చేసి వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ అప్పట్లో మహానటి విడుదల సమయంలోనే పాతాళ భైరవి తరహాలో ఓ సినిమా అనుకుంటున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్‌తో చేయబోయే సినిమాకు అలాంటి కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: July 19, 2020, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading