పేరు మార్చుకుంటున్న ప్రభాస్.. కారణం ఆమెనా..

సాహో లాంటి సూపర్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 11, 2020, 11:15 AM IST
పేరు మార్చుకుంటున్న ప్రభాస్.. కారణం ఆమెనా..
Twitter
  • Share this:
సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తాజాగా వచ్చిన సినిమా జాను. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా తమిళ్‌లో నటించిన 96‌కు రీమేక్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. తమిళ 96ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాను కూడా దర్శకత్వం వహించాడు. అది అలా ఉంటే సాహో లాంటి సూపర్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గోపిచంద్‌తో జిల్ సినిమాను తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. కాగా మొదటనుండి ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ఇప్పుడు ఆ పేరు మారనుందని తెలుస్తోంది. ఆ స్థానంలో ‘ఓ డియర్‌’ అనే పేరు పెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం.

prabhas new movie,prabhas new movie updates,prabhas,prabhas new movie trailer,prabhas new movie teaser,prabhas new movie look,prabhas movies,prabhas jaan movie updates,prabhas latest updates,prabhas latest news,prabhas with pooja hegde,prabhas new look,prabhas next movie,prabhas jaan movie,heroine for prabhas new movie with radha krishna,prabhas new film trailer,prabhas radha krishna movie,
ప్రభాస్, జానులో సమంత Photo : Twitter


ఆపేరుతో పాటు ‘రాధే శ్యామ్‌’ అనే మరో పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ రెండు పేర్లను చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా రిజిస్టర్ చేయించింది. హఠాత్తుగా ఈ సినిమా పేరు మార్చాల్సీరావాడనికి కారణం సమంత తాజా సినిమా 'జాను' కారణమట. జాను సినిమాాలో సమంత జానకి పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల పేర్లు ఒకే విధంగా పలకడంతో జనాలు తికమక పడకుండా చిత్రబృందం ఈ సినిమా పేరు మార్చాలనే నిర్ణయం తీసుకుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు కారణం అదా.. ఇంకోటా.. అనేది మాత్రం తెలియదు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల పూజా హెగ్డే నటిస్తోంది. మరో కీలక పాత్రలో పాపులర్ హిందీ నటి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే వేసవిలో (2021) ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు