ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైనా దీపికా పదుకొనేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈసినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Welcoming with a full heart, the pride of a billion Indians. The Amitabh Bachchan. Our journey just got BIG-ger!
దీంతో అమితాబ్ తెలుగులో నటిస్తోన్న మూడో సినిమా ఇది. ఆయన గతంలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మనంలో నటించారు. అయితే మనంలో ఆయనది గెస్ట్ రోల్ మాత్రమే. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరాలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో అమితాబ్ అలరించారు. ఇక తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో అత్యంత భారీగా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమాతో అమితాబ్ మరోసారి తెలుగువారిని పలకరించనున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉండటంతో మొదట సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకుంటున్నారని గతంలో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పేరు తెరపైకొచ్చింది. రెహమాన్ ఇటీవల కాలంలో తెలుగులో ఏ సినిమా చేయలేదు. అంతేకాదు ఆయన ఒక తమిళ్లో తప్ప ఏ భాషాల్లోను ఎక్కువుగా సంగీతం అందిచట్లేదు. ఆయన చేసిన చివరి హిందీ సినిమా దిల్ బెచారా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆఖరి చిత్రానికి రెహమాన్ బాణీలు సమకూర్చగా.. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నాగ్ తన సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. రెహమాన్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అయినా.. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ దక్కుతుందనే నమ్మకంతో చిత్రబృందం కూడా ఉన్నట్టు సమాచారం.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.