Prabhas - Nag Ashwin: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ పేరుతో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్.. ముందుగా ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. దాంతో పాటు ప్రభాస్ నటిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా మొదలైంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రెండు సినిమాల కంటే ముందు.. ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై భారీ ప్రతిష్టాత్మకంగా ప్యాన్ వరల్డ్ లెవల్లో నిర్మించనున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ సమ్మర్లో మొదలుకానుందని సమాచారం. దీనికి సంబంధించిన సెట్స్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ మొదటి షెడ్యూల్లో నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను తీయాలని చూస్తున్నాడట. పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా చేస్తోంది. మరో కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఎప్పటి కప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.
Exact ga cheppalante...29th Jan and 26th feb.. :))
— Nag Ashwin (@nagashwin7) January 23, 2021
తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను నాగ్ అశ్విన్ ఈ నెల 29న ఇవ్వనున్నట్టు చెప్పాడు. మరో అప్డేట్ ఫిబ్రవరి 26న ఇస్తున్నట్టు చెప్పాడు. ఈ రెండు డేట్స్లలో నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. బహుశా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ప్రభాస్ వరుస పెట్టి అన్ని సినిమాలు చేస్తోన్న అందులో నాగ్ అశ్విన్ సినిమా కాకుండా మిగతా చిత్రాలకు సంబంధించిన టైటిల్స్ అన్ని రివీల్ చేసారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం నాగ్ అశ్విన్ ఎలాంటి ట్రీట్ ఇస్తాడనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Aswani Dutt, Bollywood news, Deepika Padukone, Nag Ashwin, Prabhas, Tollywood, Vyjayanthi Movies