ప్రభాస్ కోసం ముగ్గురు టాప్ హీరోయిన్స్‌ను ఫైనల్ చేసిన నాగ్ అశ్విన్..

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 17, 2020, 8:44 AM IST
ప్రభాస్ కోసం ముగ్గురు టాప్ హీరోయిన్స్‌ను ఫైనల్ చేసిన నాగ్ అశ్విన్..
ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter
  • Share this:
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడట. అందులో భాగంగా ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు సమాచారం. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ముగ్గురును ఫైనల్ చేశాడట నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటించనున్నాడని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: April 17, 2020, 8:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading