PRABHAS NAG ASHWIN MOVIE MICKEY J MEYER COMPOSE MUSIC AND DANI SANCHEZ LOPEZ DIRECTOR OF PHOTOGRAPHY TA
Prabhas - Nag Ashwin: ప్రభాస్ సినిమాపై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్..
ప్రభాస్, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ (File/Photo)
Prabhas - Nag Ashwin: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ పేరుతో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను నాగ్ అశ్విన్ ప్రకటించారు.
Prabhas - Nag Ashwin: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ పేరుతో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వారం పది రోజుల షూటింగ్‌తో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఆ తర్వాత ప్రభాస్.. ముందుగా ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇప్పటికే సింగరేణిలో కొన్ని సన్నవేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దాంతో పాటు ప్రభాస్ నటిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా మొదలు పెట్టారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రెండు సినిమాల కంటే ముందు.. ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై భారీ ప్రతిష్టాత్మకంగా ప్యాన్ వరల్డ్ లెవల్లో నిర్మించనున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ సమ్మర్లో మొదలుకానుందని సమాచారం. దీనికి సంబంధించిన సెట్స్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ మొదటి షెడ్యూల్లో నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను తీయాలని చూస్తున్నాడట. పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా చేస్తోంది. మరో కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఎప్పటి కప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నట్టు ప్రకటించాడు. మహానటికి మిక్కీ జే మేయర్ ఇచ్చిన సంగీతం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ సినిమాకు సినమాటోగ్రఫర్గా Dani Sanchez Lopez పనిచేయనున్నట్టు ట్వీట్ చేసారు.
మరోవైపు ఫిబ్రవరి 26న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ టైటిల్ ప్రకటిస్తే.. ఈ సినిమాకు ఏ పేరు నిర్ణయాస్తారనేది చూడాలి. మరోవైపు బాలీవుడ్లో మరో క్రేజీ దర్శకుడు చెప్పిన చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం.