Home /News /movies /

PRABHAS NAG ASHWIN MOVIE LATEST UPDATE NIVETHA THOMAS TO PLAY A KEY ROLE SR

Prabhas-Ntr : ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో ఎన్టీఆర్ భామకు బంపర్ ఆఫర్..

ప్రభాస్, ఎన్టీఆర్ Photo : Twitter

ప్రభాస్, ఎన్టీఆర్ Photo : Twitter

Prabhas-Nag Ashwin : 'మహానటి' సినిమాతో సూపర్ పాపులరైనా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.

    నివేదా థామస్.. నాని 'జెంటిల్ మెన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ కేరళ కుట్టి. ఆ తరువాత ఎన్టీఆర్‌తో కలిసి 'జై లవ కుశ', కల్యాణ్‌రామ్‌ కలిసి '118' చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత 'బ్రోచేవారెవరురా'.. సినిమాతో మంచి హిట్ అందుకున్న నివేదా ప్రస్తుతం నాని సరసన 'వి' అనే చిత్రంతో నటిస్తోంది. తాజాగా ఈ భామ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అది అలా ఉంటే ఈ భామకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రభాస్ నటించే ఓ భారీ చిత్రంలో నివేదకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. 'మహానటి' సినిమాతో సూపర్ పాపులరైనా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు నిర్మించిన వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు తాజాగా నివేద థామస్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 300 కోట్లతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్నీ పూర్తి చేసిన నాగ్ అశ్విన్.. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడట.

    Nivetha Thomas news,nivetha thomas,nivetha thomas movies,nivetha thomas age,nivetha pethuraj,nivetha thomas speech,nivetha thomas affairs,nivetha thomas cute entry,nivetha thomas interview,nivetha thomas biography,nivetha thomas superb speech,sree vishnu vs nivetha thomas,nivetha thomas dance performance,niveda thomas movies,nivetha thomas hot,nivetha thomas gym,nivetha thomas 2019,nivetha,nivetha thomas & more,nivetha thomas weight,Nivetha Thomas, nivetha Thomas in akhil movie, nivetha Thomas new movie, nivetha Thomas hot photoshoot, nivetha Thomas hot photos, Tollywood, నివేధా థామస్, నివేదా థామస్ అఖిల్ మూవీ, నివేదా థామస్ హాట్ ఫోటో షూట్, టాలీవుడ్,
    నివేదా థామస్ Photo : Instagram


    ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' చిత్రంలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మరోపక్క ప్రభాస్ తన 22వ చిత్రాన్ని 'ఆదిపురుష్' అంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పౌరాణికం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రభాస్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనున్నది సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nag Ashwin, Prabhas Latest News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు