ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికీ దీపికా, ఆలియా భట్లను సంప్రదించారు. ఆలియా భట్ .. ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ’బ్రహ్మాస్త్ర’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు రెండు మూడు సినిమాలకు ఆల్రెడీ ఓకే చెప్పింది. ఆ తర్వాత దీపికా ను సంప్రదిస్తే.. ఆమె కూడా ముందుగా ఏమి చెప్పలేదు. ప్రస్తుతం ఈ భామ.. తన భర్త రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘83’లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత దీపికా మరో సినిమా కూడా ఒప్పుకోలేదు. తాజాగా దీపికా పదుకొణే.. నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో పాటు.. ప్రభాస్ సరసన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా చేయడానికి ఎట్టకేలకు ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో దీపికాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘ ఓ డియర్ ’ చిత్రం అక్టోబర్ వరకు కంప్లీట్ కానుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సోషియో ఫాంటసీ లాంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట. అంతేకాదు వచ్చే యేడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమచారం. ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా రానా నటించే అవకాశాలున్నాయి. బాహుబలి తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇక నాగ్ అశ్విన్ అప్పట్లో మహానటి విడుదల సమయంలోనే పాతాళ భైరవి తరహాలో ఓ సినిమా అనుకుంటున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్‌తో చేయబోయే సినిమాకు అలాంటి కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Bollywood, Deepika Padukone, Nag Ashwin, Prabhas, Prabhas 21, Tollywood, Vyjayanthi Movies