Prabhas - Nag Ashwin : బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచినా.. నార్త్‌లో మాత్రం ఈ సినిమా ఇరగదీసింది. అంతేకాదు హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో చూపించింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్.. మర్యాద పురుషోత్తముడు శ్రీ రామచంద్రుడి పాత్రలో అలరించనున్నారు. ఇప్పటికే ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
దాంతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్గా గురు పూర్ణిమ రోజున రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ సినిమాను ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కాకుండా మరో ఇద్దరు స్టార్ హీరోలు నటించనున్నట్టు సమాచారం. వాళ్లు ఎవరో కాదు.. నాని, విజయ్ దేవరకొండ.
కథ ప్రకారం.. ఒక కాలం నుంచి మరో కాలానికి వెళ్లే ప్రభాస్‌కు భూత కాలంలో ఓ క్యారెక్టర్ ఉండనుంది. మరి భవిష్యత్తులో మరో ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఈ పాత్రలను స్టార్ హీరోలు చేస్తే ఈ సినిమా కథకు మరింత బాగుంటుందనే ఉద్దేశ్యంతో నాగ్ అశ్విన్.. నాని, విజయ్ దేవరకొండను కలిసి కథలో వీరి పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్ వివరించడంతో వీళ్లిద్దరు ఈ సినిమాలో నటించడానికి యాక్సెప్ట్ చేసినట్టు సమాచారం. పైగా నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీలో నాని, విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే కదా. పైగా నాగ్ అశ్విన్ సెకండ్ మూవీ ‘మహానటి’లో విజయ్ దేవరకొండ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. పైగా ఈ చిత్రానికి నాని వాయిస్ ఓవర్ అందించారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో చేస్తోన్న ‘ప్రాజెక్ట్ K’లో నాని, విజయ్ దేవవరకొండ యాక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
NTR - Koratala Siva: కొరటాల శివ సినిమా కోసం ఆ సాహసం చేస్తోన్న ఎన్టీఆర్..
SP Balasubrahmanyam : అమ్మకానికి దివంగత ఎస్పీ బాలు ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్..
అల్లు అర్జున్ కూతురు నుంచి ఎన్టీఆర్ కుమారుడు వరకు వెండితెరపై స్టార్ కిడ్స్ సందడి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adipurush, Amitabh bachchan, Aswani Dutt, Bollywood news, Deepika Padukone, Nag Ashwin, Nani, Prabhas, Project K, Radhe Shyam, Salaar, Tollywood, Vijay Devarakonda, Vyjayanthi Movies