PRABHAS NAG ASHWIN MOVIE ANOTHER INTERESTING UPDATE HERE ARE THE DETAILS TA
ప్రభాస్, నాగ్ అశ్విన సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..
ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా స్టోరీ పై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఈ పోస్టర్ ఏమంత కొత్తగా లేదు అంటూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘రాధే శ్యామ్’ మూవీ తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈచిత్రాన్ని నాగ్ అశ్విన్.. మన పురాణ కథల ఆధారంగా ఇప్పటి సమాజానికి అన్వయిస్తూ ఈ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమా ప్రభాస్.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.
ప్రభాస్, నాగ్ అశ్విన్,అశ్వనీదత్ (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటీనటులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట నాగ్ అశ్విన్. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికీ దీపికా, ఆలియా భట్లను సంప్రదించారు. కానీ దీపికా మాత్రం ఈ సినిమాకు అడిగిన రెమ్యునరేషన్ భారీ డిమాండ్ చేయడంతో చిత్ర నిర్మాతలు ఏమి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆమెనే ఈ సినిమాలో తీసుకోవాలా ? వద్దా అనే డైలామాలో ఉన్నారట. కానీ నాగ్ అశ్విన్ మాత్రం దీపికా అడిగినంత ఇచ్చి ఆమెనే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మాటలను సాయి మాధవ్ బుర్రా రాసే పనిలో నిమగ్నమయ్యాడు.
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘ రాధే శ్యామ్ ’ చిత్రం కంప్లీటయ్యే దానిపై ఆధారపడి ఉంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేసిన తర్వాత కానీ నాగ్ అశ్విన్ చిత్రం సెట్స్ పైకి వెళ్లేలా లేదు. ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్గా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనల్ కాలేదని సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.