ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా కాకుండా మరో క్రేజీ హీరోయిన్..

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణే కాకుండా మరో కథానాయికకు ఈ సినిమాలో చోటు ఉందట. ఈ పాత్ర కోసం మరో క్రేజీ హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: August 16, 2020, 9:28 AM IST
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా కాకుండా మరో క్రేజీ హీరోయిన్..
ప్రభాస్,దీపికా పదుకొణే (File/Photo)
  • Share this:
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ ప్యాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణే నటిస్తోంది. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని భాషలకు చెందిన భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ చిత్రంలో కథకు కీలకమైన మరో హీరోయిన్‌‌కు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఆ పాత్ర కోసం ప్రముఖ కథానాయిక నివేదా థామస్ పేరును పరిశీలిస్తున్నారు.

ఫ్రభాస్ సరసన నివేదా థామస్ (File/Photo)


ఇప్పటికే నివేదా థామస్.. మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’లో మరో కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న ఈ పాత్ర కోసం నివేదా అయితే బాగుంటుందని నివేదా కలసి ఈ చిత్రంలో ఆమె పాత్రను వివరించారట. ఇక నివేదా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో అవకాశం రావడంతో పాటు అందులో తన పాత్ర కూడా మంచిగా ఉండటంతో ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 16, 2020, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading