దేవకన్య కుమారుడిగా ప్రభాస్.. నాగ్ అశ్విన్ సోషియో ఫాంటసీ..

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 11, 2020, 11:14 AM IST
దేవకన్య కుమారుడిగా ప్రభాస్.. నాగ్ అశ్విన్ సోషియో ఫాంటసీ..
ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter
  • Share this:
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ భారీ చిత్రం ఏ జోనర్ లో రానుంది? కథ ఏమై ఉంటుంది అనే అంశంపై ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఇది ఓ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. అందులో భాగంగా ఓ సామాన్య మానవుడు, దేవకన్య మధ్య ప్రేమకు గుర్తుగా పుట్టిన ఓ పిల్లాడి కథనే ఈ సినిమా అని ఓ రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ సందడి చేస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు సమాచారం. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ముగ్గురును ఫైనల్ చేశాడట నాగ్ అశ్విన్. ఆ ముగ్గురులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: May 11, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading