గురుపూర్ణిమ సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ప్రాజెక్ట్ కే మొదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్ మొదటగా అమితాబ్ బచ్చన్‌పై కొట్టారు. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో ప్యాన్ వరల్గ్ లెవల్లో వస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకున్నారు. గురు పూర్ణిమా సందర్భంగా ఇండియా సినిమా గురువు అమితాబ్ బచ్చన్‌పై కొట్టానని సంబరంగా రాసుకున్నారు. ఈ సినిమా త్వరలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నాడు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.
View this post on Instagram
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepika Padukone, Nag Ashwin, Prabhas, Tollywood news