• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS NAG ASHWIN FILM LATEST UPDATE THIS FILM SHOOT STARTS FROM SUMMER IT SEEMS HERE ARE THE DETAILS SR

Prabhas | Nag Ashwin : ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్.. సమ్మర్ నుంచి షూటింగ్ మొదలు..

Prabhas | Nag Ashwin : ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్.. సమ్మర్ నుంచి షూటింగ్ మొదలు..

ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter

Prabhas | Nag Ashwin : ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన ఆ మధ్య విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్‌ సమ్మర్‌లో మొదలుకానుందని సమాచారం. దీనికి సంబంధించిన సెట్స్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ మొదటి షెడ్యూల్‌లో నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను తీయాలని చూస్తున్నాడట. పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. మరో కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు.

    ప్రభాస్ ప్రకటించిన అన్ని సినిమాల్లో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు ఇటీవల విడుదలైన పోస్టర్ అండ్ టైటిల్ కూడా మాంచి థ్రిల్లింగ్‌ కు గురిచేస్తోంది. ఇక అప్పుడే ఈ సినిమా స్టోరిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడట.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)













    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)













    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)





    అంతే కాకుండా పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఎంచుకొన్నాడని తెలుస్తుంది. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని టాక్. ఇక లేటెస్ట్ మరో క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ తర్వాత ఈ సలార్ మొదలుకానుంది మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఇక ప్రభాస్ నటించనున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈమెనే ప్రభాస్ కు సరసన మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న టాక్.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)





    ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఈ యాక్షన్ మూవీ 2021 ప్రారంభంలో సెట్స్‌పైకి  వెళ్తుందని ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం ట్వీట్ చేసింది. ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా.. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు