‘సాహో’ రిలీజ్ రోజే ప్రభాస్ సొంత మల్టీప్లెక్స్ ఓపెనింగ్.. ఎక్కడో తెలుసా..

Saaho | అవును ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ రిలీజ్ రోజునే.. ఆ పార్ట్‌నర్ షిప్‌లో నిర్మించిన ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 28, 2019, 9:34 AM IST
‘సాహో’ రిలీజ్ రోజే ప్రభాస్ సొంత మల్టీప్లెక్స్ ఓపెనింగ్.. ఎక్కడో తెలుసా..
ప్రభాస్ ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్
  • Share this:
అవును ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ రిలీజ్ రోజునే.. ఆ పార్ట్‌నర్ షిప్‌లో నిర్మించిన ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ఆధ్వర్యంలో నిర్మించిన  ఈ మల్టిప్లెక్స్‌ ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్‌గా గుర్తింపు పొందనుంది. ‘వి ఎపిక్’ పేరుతో  ఉన్నఈ మల్టీప్లెక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లురు పేటలో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌ను యు.వి.క్రియేషన్స్‌ అధినేతల్లో ఒకరైన నెల్లూరుకు చెందిన వేమారెడ్డి వంశీ ప్రధాన భాగస్వామిగా ప్రభాస్ ఈ మల్టీప్లెక్స్‌ను భారీ ఎత్తున నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్‌ను ఆగష్టు 30 ‘సాహో’ సినిమాతో ప్రారంభం కానుంది.

నెల్లూరులో ‘సాహో’ సినిమాతో ప్రారంభం కానున్న ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్


ఈ మల్టీప్లెక్స్‌లో మూడు థియేటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఈ థియేటర్ ఉంది. వాల్డ్ వైడ్‌గా అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది మూడోది. ఇక మన దేశంతో పాటు ఆసియా ఖండంలోనే ఇదే అతి పెద్ద సిల్వర్ స్క్రీన్. ఈ మల్లీప్లెక్స్‌లో 647 సీట్ల కెపాసిటీతో ఓ థియేటర్. 140 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్ నిర్మించారు. మరి ఈ మల్టీప్లెక్స్‌ను ప్రభాస్ తన చేతులు మీదుగా  ఓపెనింగ్ చేస్తాడా లేకపోతే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు లేకపోతే ఇంకెవరైనా రాజకీయ నేత ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభోత్సవం చేస్తారా అనేది చూడాలి.

Published by: Kiran Kumar Thanjavur
First published: August 28, 2019, 9:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading