Prabhas: ప్రభాస్ సినిమాకు నో చెప్పిన టాప్ హీరోయిన్.. కారణం తెలిస్తే షాక్ అవాల్సిందే. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఎవరైనా ఒదులుకుంటారా. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకుని ఇపుడు తెగ బాధపడిపోతుంది. వివరాల్లోకి వెళితే.. రకుల్ ప్రీత్ సింగ్.. ఒకవైపు తెలుగు, తమిళం, మరోవైపు హిందీ సినిమాలతో పుల్లు బిజీగా ఉంది. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకొచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో దాదాపు అగ్ర కథానాయకులందరితో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ హీరోయిన్గా టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆమె కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఐతే.. కెరీర్ ప్రారంభంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఒదులుకుందట.
అది కూడా సరైన అవగాహన లేకుండా ఇదంత జరింగిందంటోంది ఈ భామ. అప్పట్లో ఈ చిత్రంలో తాప్సీ ప్లేస్‌లో రకుల్ నే తీసుకున్నారు. మూడు నాలుగు రోజులు కూడా షూటింగ్లో పాల్గొంది. ఐతే.. అప్పట్లో మిస్ ఇండియా కావడమే లక్ష్యంగా పెట్టుకున్న రకుల్. ఈ పోటీలో పాల్గొనడానికి ఈ సినిమా అడ్డుగా నిలవడంతో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి వైదొలిగింది.
దీంతో ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్టు వివరించింది. అప్పట్లో సినిమా రంగం తనకు సరైన రంగం కాదనుకోవడం వల్ల ఇదంత జరిగిందన్నారు. అంతా కుదిరితే.. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అయ్యాదాన్ననని రకుల్ ప్రీత్ సింగ్ పలు ఇంటర్వ్యూలో పేర్కొంటూ అనవసరంగా ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు వివరిస్తూనే ఉంది.
ఏమైనా ఎప్పటికైనా.. ప్రభాస్‌తో కలిసి నటించడం తన కల అంటోంది ఈ భామ. మరి రకుల్ ప్రీత్ సింగ్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తుందా లేదా అనే దానికి కాలమే నిర్ణయిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adipurush, Prabhas, Rakul Preet Singh, Tollywood