రామ్‌ చరణ్‌కు సాహో టెన్షన్ పట్టుకుందా...

సాహో సినిమా రిజల్ట్‌పై ఆ చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ క్రేజీ హీరో రామ్‌చరణ్‌కు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: August 29, 2019, 7:19 PM IST
రామ్‌ చరణ్‌కు సాహో టెన్షన్ పట్టుకుందా...
ప్రభాస్ రామ్ చరణ్ (Source: Twitter)
  • Share this:
మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ప్రభాస్ నయా మూవీ సాహో రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి మూవీ లవర్స్ అందరిలోనూ నెలకొంది. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన ప్రభాస్ నయా మూవీ సాహోపై బాలీవుడ్‌లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సక్సెసయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరిగినట్టే అని సినీ క్రిటిక్స్ లెక్కలు వేసుకుంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కిన సాహో సినిమా అన్ని భాషల్లోనూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇదిలా ఉంటే సాహో సినిమా రిజల్ట్‌పై ఆ చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ క్రేజీ హీరో రామ్‌చరణ్‌కు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

ఇందుకు ప్రధాన కారణంగా సాహో తరువాత ఆ స్థాయిలో అన్ని భాషల్లో చిరంజీవి సైరాను రిలీజ్ చేయనుండటమే. సాహో తరహాలోనే సైరాను కూడా హిందీ సహా అన్ని భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అక్టోబర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోయే ఈ సినిమాపై కూడా సినీవర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సాహో సినిమా మంచి ఫలితం సాధిస్తేనే... టాలీవుడ్‌లో తెరకెక్కించిన సైరా సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు పెరుగుతాయనే అభిప్రాయం ఉంది. ఒకవేళ సాహో రిజల్ట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా... ఆ ప్రభావం మెగాస్టార్ చిరంజీవి సైరాపై కూడా పడుతుందనే భావనలో రామ్‌చరణ్ ఉన్నట్టు టాక్. మొత్తానికి సాహో రిజల్ట్’ కోసం అందరిలాగే రామ్‌చరణ్ కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: August 29, 2019, 7:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading