Home /News /movies /

PRABHAS MOVIE ADIPURUSH UPDATE GO VIRAL ON SOCIAL MEDIA SB

Prabhas: ప్రభాస్ మూవీ ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్ డేట్..!

ప్రభాస్‘ఆదిపురుష్’  Adipurush Photo : Twitter

ప్రభాస్‘ఆదిపురుష్’ Adipurush Photo : Twitter

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా మనకు కనిపిస్తాడు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ మేకోవర్ చేసుకున్నాడు. విలువిద్యలో శిక్షణ తీసుకున్నాడు.

    రాధే శ్యామ్ (Radhe shyam) తర్వాత టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏ- ఆది పురుష్”(Adipurush). ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరోకరు కూడా నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో జనకమహారాజుగా కృష్ణంరాజు నటిస్తున్నారని సమాచారం.  ఈ వార్త నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ అప్ డేటే. ఇక ఈ చిత్రం కోసం ప్రభాస్‌ చాలా సవాళ్లను ఫేస్‌ చేశాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డారు.

    ముఖ్యంగా విలువిద్యలో ప్రభాస్‌ శిక్షణ కూడా తీసుకున్నాడు. పైగా విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉంటారు. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. దీంతో ప్రభాస్ సైతం తన లుక్‌ను అలాగే మార్చుకున్నాడు. డైలాగ్స్ విషయంలో కూడా చాలా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఆదిపురుష్‌’గా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ గా ఉంటాడని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

    ఇక ఈ సినిమాను `ఆదిపురుష్‌` మూవీని మాత్రం ఐదు వందల కోట్లతో నిర్మిస్తున్నట్టు చెప్పి షాకిచ్చాడు నిర్మాత. భారీ విజువల్‌ వండర్‌గా ఈ సినిమా ఉండబోతుందట. కనీవినీ ఎరుగని రీతిలో విజువల్స్ ఉంటాయని టాక్‌. విజువల్‌ ఎఫెక్ట్స్ వరల్డ్ క్లాస్‌ క్వాలిటీతో డిజైన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న `ఆదిపురుష్‌` చిత్రాన్ని టీ సిరీస్‌ నిర్మిస్తుంది. భూషణ్‌ కుమార్‌ నిర్మాత. మైథలాజికల్‌ మూవీ కావడంతో కాస్ట్యూమ్స్, విజువల్‌కి స్కోప్‌ ఉంటుంది. భారీగా సెట్స్ వేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో యూనిట్‌ చాలా కేర్‌ తీసుకున్నారని, రాజీ లేకుండా నిర్మించారని తెలుస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో,సినిమా వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Adipurush, Adipurush movie, Krishnam Raju, Prabhas

    తదుపరి వార్తలు