• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS MIRCHI HEROINE RICHA GANGOPADHYAY BECOME MOTHER HERE ARE THE DETAILS TA

Prabhas: తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్ .. మిర్చి భామ ఇంట్లో సంబరాలు..

Prabhas: తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్ .. మిర్చి భామ ఇంట్లో సంబరాలు..

ప్రభాస్ (File/Photo)

తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్ .. మిర్చి భామ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి.

  • Share this:
    తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్ .. మిర్చి భామ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ప్రభాస్ హీరోగా కొరటాల శివ  దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిర్చి’ సినిమాలో మానసగా తనదైన నటనతో ఆకట్టుకుంది. చివరగా ఈ భామ తెలుగులు నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత హైయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లి.. అక్కడ జో లాంగెల్ల అనే ఫారెనర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రిచా గంగోపాధ్యాయ్ .. కాస్తా రిచా లాంగెల్ల అయిపోంది. అమెరికన్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈమెకు అమెరికన్ పౌరసత్వం వచ్చింది. 2017లో అమెరికలోని వాషింగ్‌టన్ యూనివర్సిటీ నుంచి MBA పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత 2018లో జో లాంగెల్లను పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ భామ తాను తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

    ఈ మేరకు తాను గర్భంతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. జూన్ నెలలో మా ఫ్యామిలీలో ఓ కొత్త మెంబర్ రానున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మేము ఎంతో ఆనందంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.



    రిచా గంగోపాధ్యాయ్ విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ‘లీడర్’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి చివరగా ‘భాయ్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. అక్కడ జో లాంగెల్లను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ సినిమాలకు దూరంగా కుటుంబంతో ఎంతో హ్యాపీగా ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: