Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 13, 2021, 9:52 PM IST
ప్రభాస్ (Prabhas)
ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కానేకాదు.. ఎందుకంటే ఈయన చేసే సినిమాల రేంజ్ మారిపోయింది. ఒక్కో సినిమా కోసం కనీసం 200 కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. కొన్నింటికి ఏకంగా 300 కోట్లు అంటున్నారు. ఒకప్పుడు కలలో కూడా ఇంత బడ్జెట్ పెడతారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ రాజమౌళి వచ్చి బాహుబలితో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. దాంతో ఇప్పుడు ఒక్కో సినిమాకు అన్ని వందల కోట్లు పెడుతున్నారు. దానికి తోడు ప్రభాస్ కోసమే నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈయన వరస సినిమాలు అయితే భారీగానే ఒప్పుకుంటున్నాడు. ఒక్కో సినిమా కోసం 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్లానింగ్ కూడా వర్కవుట్ అయితే ఇండస్ట్రీ రికార్డులన్నీ తీసుకుని తన జేబులో పెట్టుకోవచ్చు ప్రభాస్. అయితే అది మాటల్లో చెప్పినంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే రాత్రింబవళ్లు కష్టపడితే కానీ ఇప్పుడు అనుకున్నది జరగదు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని సాహో సినిమాకు ముందు.. బాహుబలి విడుదలైన తర్వాత మాటిచ్చాడు ప్రభాస్. కానీ అది జరగలేదు. సాహో కోసం కూడా రెండేళ్లకు పైగానే తీసుకున్నాడు. ఇప్పుడు రాధే శ్యామ్ కూడా రెండేళ్లైపోయింది. ఇలా ఎలా చూసుకున్నా కూడా ఒక్కో సినిమా కోసం రెండేళ్లకు పైగానే టైమ్ తీసుకుంటున్నాడు ప్రభాస్. కానీ ఇప్పుడు ఆ సినిమాల మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్. దానికోసం ప్రత్యేకంగా ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రతీ ఆర్నెళ్ళు.. 9 నెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటన్నింటి రిలీజ్లు కూడా తక్కువ గ్యాప్‌లోనే ఉండేలా చూస్తున్నాడు.

రాధే శ్యామ్ పోస్టర్ (Radhe Shyam movie)
రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ 2021 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఆ తర్వాత ఆర్నెళ్లకు అంటే 2022 జనవరికి ప్రశాంత్ నీల్ సలార్ విడుదల కానుందని తెలుస్తుంది. ఈ మేరకు ఈయన జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. మరోవైపు సలార్ వచ్చిన 8 నెలల్లోనే ఓం రౌత్ ఆదిపురుష్ రానుంది.

రెబల్‌స్టార్ ప్రభాస్
ఈ చిత్రం ఆగస్ట్ 8, 2022కి విడుదలవుతుందని ఇప్పటికే చెప్పారు దర్శక నిర్మాతలు. ఇలా ప్రతీ ఆర్నెళ్లకు ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా 2023లో విడుదల కానుంది. వినడానికి ఈ ప్లాన్ మహత్తరంగా ఉంది.. కానీ వర్కవుట్ అయితే మాత్రం ప్రభాస్ అభిమానులకు అంతకంటే పెద్ద పండగ మరోటి ఉండదేమో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
January 13, 2021, 9:48 PM IST