సైరా కోసం రంగంలోకి దిగబోతున్న ప్రభాస్

సైరా బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 23, 2019, 11:37 AM IST
సైరా కోసం రంగంలోకి దిగబోతున్న ప్రభాస్
ప్రభాస్ (Photo : Facebook)
news18-telugu
Updated: September 23, 2019, 11:37 AM IST
త్వరలోనే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి నయా మూవీ సైరాపై అంచనాలు భారీ ఉన్నాయి. దక్షిణాదిలో ఈ సినిమా ప్రమోషన్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినా... బాలీవుడ్‌లో సినిమాను ఏ రకంగా ప్రమోట్ చేయాలనే అంశంపై మూవీ మేకర్లు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. తమకున్న పరిచయాల ద్వారా పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలతో సైరాకు బెస్ట్ విషెస్ చెప్పించేందుకు రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వంటి స్టార్స్ సైరా ట్రైలర్‌ను ట్వీట్ చేసి సినిమా ప్రమోషన్‌కు సహకరించారు.

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి ప్రభాస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సాహో ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్‌లను కలిసిన సంగతి తెలిసిందే. సైరా ట్రైలర్ చూసి చిరంజీవి తనకు ఫోన్ చేసిన అభినందించారని ప్రభాస్ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

Prabhas Chiranjeevi Ram Charan posed in a single fame after the event of Sye Raa Narasimha Reddy teaser launch pk తెలుగు సినిమా స్థాయిని పెంచిన మూడు సినిమాలు.. ఆ ముగ్గురు కథానాయకులు.. ఒకే ఫ్రేములో కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సిందేం ఉంది. ఇప్పుడు ఇదే జరిగింది. sye raa,sye raa teaser,sye raa teaser launch,sye raa ram charan,sye raa chiranjeevi,prabhas saaho,saaho release date,rrr,rrr movie shooting,saaho promotions,saaho movie,prabha chiranjeevi ram charan,telugu cinema,రామ్ చరణ్,చిరంజీవి,ప్రభాస్,ప్రభాస్ సాహో,సైరా చిరంజీవి,సైరా టీజర్ లాంఛ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ ప్రభాస్ చిరంజీవి (Source: Twitter)


దీంతో సైరా బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ సాయం తీసుకోవాలని రామ్ చరణ్ భావిస్తున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్‌లో ప్రభాస్‌కు గుర్తింపు ఉండటంతో... సైరాకు ప్రభాస్ ప్రమోషన్ కలిసొస్తుందనే భావనలో రామ్ చరణ్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి సైరా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగితే... బాలీవుడ్‌లో ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...