హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Salaar: ‘సలార్’లో ప్రభాస్ డబుల్ ధమాకా.. ప్రశాంత్ నీల్ కొత్త స్కెచ్..

Prabhas - Salaar: ‘సలార్’లో ప్రభాస్ డబుల్ ధమాకా.. ప్రశాంత్ నీల్ కొత్త స్కెచ్..

ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి అలాంటి సంచలన సినిమాతో రాబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో చూపించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈయన కోసం చూస్తున్నారు స్టార్ హీరోలు. కెజియఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు తెరతీసాడు ప్రశాంత్ నీల్.

ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి అలాంటి సంచలన సినిమాతో రాబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో చూపించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈయన కోసం చూస్తున్నారు స్టార్ హీరోలు. కెజియఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు తెరతీసాడు ప్రశాంత్ నీల్.

Prabhas - Salaar | ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత ప్రభాస్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.

Salaar - Prabhas - Prashanth Neel:  ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ కంప్లీట్ చేసారు. ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికీ కరోనా పరిస్థితులు అనుకూలిస్తే.. ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే.. పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఇక  ఈ సినిమా మొదటి షెడ్యూల్ సింగరేణిలో పూర్తి చేసారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుగుతోంది.  ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌‌ను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం.

ఐతే.. ఈ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాను పిక్చరైజ్ చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ లో చిత్రీకరించనున్నాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతానికి వాయిదా వేసారు.  కథతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ షూట్ చేసిన ప్రాంతాల్లో ‘సలార్’ సినిమాను పిక్చరైజ్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ  సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘బాహుబలి’ సిరీస్‌లో రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాత్ర కథ ప్రకారం చనిపోతుంది.  ఇపుడు ‘సలార్’లో చేసే రెండు పాత్రల్లో ఒక పాత్ర చనిపోయే క్యారెక్టరా కాదా అనేది చూడాలి.  ‘సలార్’ సినిమా విషయానికొస్తే..  వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  ఈ సినిమా విడుదలకు యేడాదికి ముందే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నయట.

KGF Fame Prashanth Neel Announced Another Crazy project With sriimurali Bagheera, Prashanth Neel : ’సలార్’తో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్..,Prabhas,Prashanth Neel,Prashanth Neel Bagheera,Prashanth Neel With New Project Sriimurali Bagheera,Prabhas Salaar Movie,Prabhas Prashanth Neel,Prabhas Prashanth Neel SALAAR movie,SALAAR movie, SALAAR,prabhas news, Prabhas to sign film with KGF director Prashanth Neel,sunny singh, Adipurush Update release date confirmed,Prabhas looks lord rama, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్,ప్రభాస్ అసదుద్దీన్ ఓవైసీ,ప్రభాస్,ప్రభాస్ ప్రశాంత్ నీల్,ప్రశాంత్ నీల్ బఘీరా,ప్రశాంత్ నీల్ శ్రీ మురళి బఘీరా
ప్రభాస్,ప్రశాంత్ నీల్ (Twitter/Photo)

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ .. ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ ను రూ. 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట.బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రేటు ప్రకటించలేదు. కానీ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. అందుకే ఇంత మొత్తంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ గురించి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట.

Kriti Sanon, Prabhas, Prabhas Adipurush, Prabhas Adipurush movie, ప్రభాస్ , ప్రభాస్ ఆదిపురుష్, ఆదిపురుష్ మూవీ
ప్రభాస్ ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా సన్ని సింగ్, సీతగా కృతి సనన్ (Twitter/Photo)

‘సలార్’ పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు ఆది నుంచి అవాంతరాలు ఏర్పడడంతో ఈ సినిమా కోసం ప్రభాస్ కుటుంబ సభ్యుల సలహాతో  శాంతి హోమం చేయిస్తున్నారట. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్  నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాకు కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సలార్’ అనే ఉర్దూ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. రాజుకు కుడి భుజంగా వ్యవహరించి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి.  అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది.

First published:

Tags: Bollywood news, Prabhas, Prashanth Neel, Salaar, Sandalwood, Shruthi hassan, Tollywood

ఉత్తమ కథలు