Home /News /movies /

PRABHAS MARUTHI MOVIE UPDATE A HUGE HOUSE SET WILL BE CREATED WHICH WILL BE WORTH 6 CRORES HERE ARE THE DETAILS SR

Prabhas | Maruthi : ప్రభాస్-మారుతి సినిమాపై అదిరిపోయే అప్ డేట్ వచ్చింది..

Prabhas , Maruthi Photo : Twitter

Prabhas , Maruthi Photo : Twitter

Prabhas | Maruthi : బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రభాస్ సాహో తర్వాత ‘రాధే శ్యామ్’  (Radhe Shyam)అనే లవ్ స్టోరీ చేశారు. ఈ సినిమా మార్చి 11న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే ప్రభాస్ ఇపుడు హార్రర్ కామెడీ జానర్‌లో మారుతి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  Prabhas - Maruthi |  రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో  ప్రభాస్ వరుసగా  అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రభాస్ సాహో తర్వాత ‘రాధే శ్యామ్’  (Radhe Shyam)అనే లవ్ స్టోరీ చేశారు. ఈ సినిమా మార్చి 11న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే ప్రభాస్ ఇపుడు హార్రర్ కామెడీ జానర్‌లో మారుతి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మారుతి (Maruthi)  స్టార్ట్ చేశారట. అంతేకాదు ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట. దీంతో ఆ ఇంటికి సంబంధించిన సెట్‌ను టీమ్ భారీగా నిర్మింనున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. దీని కోసం మారుతి ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేశారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన విడుదలకాలేదు. అతి త్వరలో ఈ విషయంలో టీమ్ ఓ ప్రకటన విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఆర్ ఆర్ ఆర్‌తో భారీ హిట్ అందుకున్న డివివి దానయ్య నిర్మించనున్నారు. సినిమా లాంఛనంగా ప్రారంభం అవ్వాగానే.. వెంటనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

  మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్‌గా శ్రీలీల, మాళవిక మోహనన్ ఖరారు అయ్యినట్లు టాక్. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే పేరు పరిశీలిస్తున్నారు. మారుతి (Maruthi) స్టైల్‌లో ఇది చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో  ‘ఆదిపురుష్’ (Adipurush) చేస్తున్నారు.  రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ‘ఆదిపురుష్’ మూవీని  పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.

  Ajay Devgn - Sudeep : హిందీ భాష విషయమై ఆర్ఆర్ఆర్ హీరో అజయ్ దేవ్‌గణ్,సుదీప్ మధ్య ట్విట్టర్ వార్..

  ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమా 11 ఆగస్టు 2022 న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలనుకున్నారు. ఇక మరోవైపు ప్రభాస్.. సలార్‌(Salaar)తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. అంతేకాదు అమితాబ్, ప్రభాస్ లపై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. మన దేశంలోనే ఈ సినిమా అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కనుంది. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K(Project K) దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేసారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాకు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Malavika mohanan, Maruthi, Prabhas, Sreeleela, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు