• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS MARRIAGE WILL POSTPHONE DUE TO THESE REASONS TA

Prabhas: ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం... అప్పటి వరకు ఆగాల్సిందేనా..

Prabhas: ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం... అప్పటి వరకు ఆగాల్సిందేనా..

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం కానుంది. దీనికో కారణం కూడా ఉంది.  సరైనా అమ్మాయి దొరకలేదా.. లేకపోతే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం కానుంది. దీనికో కారణం కూడా ఉంది.  సరైనా అమ్మాయి దొరకలేదా.. లేకపోతే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా వివరాల్లోకి వెళితే..  రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇపుడు చేస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా మరో ఎత్తు. ‘ఆదిపురుష్’ సినిమాలో తొలిసారి మర్యాద పురుషోత్తమ్మడైన శ్రీరామచంద్రుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తున్నాడు. మాములు సినిమాల్లోగా ఇందులో ఎలా పడితే.. అలా ఈ సినిమాలో నటిస్తానంటే కుదరదు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనన్ని రోజులు ప్రభాస్..  బ్రహ్మచర్యం పాటించాలి. చాపపై పడుకోవాలి. కొన్ని నియమ నిష్ఠలు పాటించాలి. ఒప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు .. ఆ తర్వాత బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమా కోసం చిరంజీవి... ‘శ్రీమంజునాథ’ సినిమా కోసం ‘అన్నమయ్య’ లో శ్రీవేంకటేశ్వర స్వామి వేషం వేసేటపుడు ఇలాంటి నియమ నిబంధలు పాటించారు.

    ప్రభాస్ సరైన నియమ నిబంధనలు పాటించనందుకే ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం సంబవించిందని ప్రభాస్ సన్నిహిత వర్గాల కథనం. ముఖ్యంగా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించిందని చెబుతున్నారు. ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి  రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే మన హీరోలు ఏదైనా సినిమా ప్రారంభించే ముందు ముహూర్తాలు గట్రా చూసుకుంటారు. పైకి ఇదేదో కనబడ్డ.. కోట్లలో జరిగే వ్యవహారం కాబట్టి.. ముహూర్తాలు మిగతా విషయాలపై హీరోలకు, నిర్మాతలు, దర్శకులకు ఇలాంటి  పట్టింపులు చాలానే  ఉంటాయి. అందుకే ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చాడు.

    ప్రభాస్ ఆదిపురుష్ ముహూర్తం షాట్ (Instagram/Photo)


    ఇపుడు అదే బాటలో ప్రభాస్ కూడా ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్.. షూటింగ్ జరిగినన్ని రోజులు.. ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభాస్.. పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు.. ఇదే నియమ నిష్ఠలతో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే ఈ సినిమా షూటింగ్ అయ్యే వరకు ప్రభాస్.. మరోసారి పెళ్లి మాట ఎత్తడం కష్టం. అందుకే ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ అయ్యేంత వరకు ప్రభాస్.. పెళ్లి ఆలోచనలు మానుకున్నట్టు సమాచారం. అందుకే ప్రభాస్.. ముందుగా.. ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ప్రభాస్ పెళ్లి వ్యవహారం.. ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్టు డైలీ సీరియల్‌లా సాగుతూనే ఉందని ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: