ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది... ‘బాహుబలి’ ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే...

ప్రభాస్ (PRABHAS) అనే పేరున్న ఖాతాకు విపరీతమైన ఫాలోవర్స్... ఒక్క రోజులోనే దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్... అఫిషియల్ ఎంట్రీ ఇస్తే ఇన్‌స్టాగ్రామ్ షేక్ అవ్వాల్సిందే! అంటున్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 7:22 PM IST
ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది... ‘బాహుబలి’ ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే...
ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది... ‘బాహుబలి’ ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 7:22 PM IST
ప్రభాస్... మూడేళ్ల కిందటి దాకా కేవలం తెలుగువారికి మాత్రమే పరిచయమైన హీరో. ఇప్పుడు ప్రభాస్ కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా... ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక స్టార్. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినీ చరిత్ర రికార్డులతో పాటు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను కూడా ఊచకోత కోసేశాడు ఈ యంగ్ రెబల్ స్టార్. అయితే మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ చాలా రిజర్వ్‌డ్ పర్సన్. సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా పాల్గొంటుంటాడు. ప్రభాస్‌కు ట్విట్టర్‌లో అకౌంట్‌ కూడా లేదు... కేవలం ఫేస్‌బుక్ మాత్రమే వాడుతున్నాడు. అందులో కూడా ఎప్పుడో గానీ పోస్టులు చేయడు. అయితే ‘బాహుబలి’ సృష్టించిన ప్రభంజనం తర్వాత మనోడి రేంజ్ మొత్తం మారిపోయింది. ప్రభాస్ తర్వాతి మూవీ ఎప్పుడు వస్తుందా... అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందంటే యంగ్ రెబల్ స్టార్ ఎక్కడిదాకా ఎదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు.
prabhas, prabhas uppalapati, Prabhas raju Uppalapati instagram, prabhas in instagram, Instagram followers Prabhas Raju, hero Prabhas news, Prabhas Saaho Updates, Prabhas Baahubali instagram, బాహుబలి ప్రభాస్, ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్, ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్, ప్రభాస్ బాహుబలి, తెలుగు సినిమా వార్తలు, ప్రభాస్ రాజు ఉప్పలపాటి ఫోటోలు, సాహో ప్రభాస్, ప్రభాస్ మూవీ అప్‌డేట్స్
‘బాహుబలి’ సినిమా రెండు సిరీస్‌లు కలిసి దాదాపు రూ.2500 కోట్లు కలెక్షన్లు సాధించి, చరిత్ర క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

అందుకే ఇప్పుడైనా కాస్త మారి... సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇవ్వాలని ప్రభాస్‌ను కోరుతున్నారు ఆయన ఫ్యాన్స్. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వాలని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ‘సాహో’ అప్‌డేట్స్ రావడం ఆలస్యం కావడంతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన దృష్ట్యా... ఇన్‌స్టాలోకి రావాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలోనే వస్తానని ప్రకటించాడు. అయితే ఆయన ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ఖాతా ఓపెన్ చేయకముందే... ప్రభాస్ (PRABHAS) అనే పేరున్న ఖాతాకు విపరీతమైన ఫాలోవర్స్ వచ్చేవారు. ఒక్క రోజులోనే దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఈ ఖాతాకు కనెక్ట్ అయిపోయారు.

prabhas, prabhas uppalapati, Prabhas raju Uppalapati instagram, prabhas in instagram, Instagram followers Prabhas Raju, hero Prabhas news, Prabhas Saaho Updates, Prabhas Baahubali instagram, బాహుబలి ప్రభాస్, ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్, ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్, ప్రభాస్ బాహుబలి, తెలుగు సినిమా వార్తలు, ప్రభాస్ రాజు ఉప్పలపాటి ఫోటోలు, సాహో ప్రభాస్, ప్రభాస్ మూవీ అప్‌డేట్స్
‘బాహుబలి’ మానియా కారణంగా మేడమ్ ట్యూంబ్స్‌లో ప్రభాస్ మైనపు విగ్రహం కూడా కొలువుతీరింది.

అందులో ఒక్క పోస్ట్ కూడా లేదు కదా...కనీసం ప్రొఫైల్ పిక్ కూడా పెట్టలేదు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఆ అకౌంట్‌ ఇప్పుడు టెక్నికల్ ఎర్రర్ అంటూ ఓపెన్ కూడా కావడం లేదు. అధికారిక ఖాతా అనే గుర్తింపు కూడా రాకముందే ఇలా ఉంటే... ప్రభాస్ అఫిషియల్ ఎంట్రీ ఇస్తే ఇంకేలా ఉంటుందోనని సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, ‘రన్ రాజా రన్’ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ఒక్కటైన ‘సాహో’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. రెండేళ్లుగా ప్రభాస్ సినిమాల కోసం వేచిచూసిన ఫ్యాన్స్ కోసం ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్.


First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...