Home /News /movies /

PRABHAS LOOKS LORD RAMA A FAN MADE PIC GOES VIRAL SR

Prabhas : ఉక్కు దేహంతో రాముడిగా ప్రభాస్.. ఆశ్చర్యపోయిన ఆదిపురుష్ దర్శకుడు..

ప్రభాస్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ Photo : Twitter

ప్రభాస్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ Photo : Twitter

Prabhas : ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో మరో ప్యాన్ ఇండియా మూవీలో నటించాడు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహోలో ప్రభాస్ సూపర్ స్టైలీష్ లుక్’లో అదరగొట్టాడు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అలరించలేకపోయింది. కానీ హిందీ రాష్ట్రాల్లో అదరగొట్టింది. ఇక సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా  ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం.

  ఈ సినిమాతో పాటు ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని తెలుస్తోంది. ఈ యాక్షన్ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా 2021 ప్రారంభంలో సెట్స్‌పైకి  వెళ్తుందని భావిస్తున్నారు.  ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. కాగా తాజా సమాచారం మేరకు హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోదనని ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రాముడిగా ప్రభాస్‌ని ఊహించుకుంటూ ఇప్పటికే అనేక ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ రాగా.. తాజాగా ఓ అభిమాని రాముని గెటప్ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందంటూ యానిమేషన్‌లో తయారు చేసి పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలో సిక్స్ ప్యాక్ బాడీతో సీరియస్ లుక్‌లో రాముడిగా ప్రభాస్ లుక్ అదిరింది. ఈ పోస్టర్‌ను చూసి రీట్వీట్ చేసిన దర్శకుడు ఓం రౌత్.. పోస్టర్ అదిరిందని... ఆ పోస్టర్ చేసిన అభిమానిని మెచ్చుకున్నాడు.


  మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఓం రౌత్ దర్శకత్వంలో సైఫ్ చేస్తున్న రెండో సినిమా ఇది. గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్ కోసం వారిద్దరూ కలిసి పనిచేశారు. ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా తీయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన శరీరాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడని చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas Latest News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు