Salaar Prabhas Look Leak: వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ కావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం బిగ్గెస్ట్ సినిమాల హవా నడుస్తోంది. దక్షిణాది నుంచి వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు (Pan India Movies) విడుదలవుతున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి (Bahubali) క్రియేట్ చేసిన మ్యాజిక్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) సినిమాలకు ఓ రేంజ్ డిమాండ్ నెలకొంది. రీసెంట్గా రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్నా కూడా.. ఆయన అప్‌కమింగ్ సినిమాలపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ (Salaar) మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ఉన్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో ప్రతి ఒక్కరి కన్ను ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీకై నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవలే KGF చాప్టర్ 2 సినిమాతో తన టాలెంట్ మరోసారి బయటపెట్టి సత్తా చాటారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నేషనల్ వైడ్‌గా పాపులారిటీ కూడగట్టుకున్న ఆయన ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ 'సలార్' సినిమాపైనే పెట్టారు. చకచకా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఆయన రీసెంట్గా కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ సెట్లో షూటింగ్ చేస్తున్నప్పటి ఓ పిక్ సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరో ప్రభాస్ ఫుల్ ఇమేజ్ కనిపించడంతో డార్లింగ్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుండగా.. చిత్ర యూనిట్ మాత్రం కాస్త కంగారు పడుతోంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా సలార్ యూనిట్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సినిమాపై వచ్చే రూమర్స్‌ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఖాతా ఓపెన్ చేశారు.
ఇకపోతే సలార్ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ దానికి సరైన ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటికే విడుదలైన సలార్ పోస్టర్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పకనే చెప్పగా.. తాజాగా సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ వయలెంట్ లుక్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. 2023 సంవత్సరంలో ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.