PRABHAS LIKES THAT QUALITY MORE IN ACTRESS ANUSHKA SHETTY AND DO YOU GUESS WHAT WAS THAT PK
Prabhas Anushka Shetty: అనుష్కలో నాకు నచ్చేది అదే.. ఆ విషయంలో ఓపెన్ అయిపోయిన ప్రభాస్..
ప్రభాస్,అనుష్క శెట్టి (Twitter/Photo)
Prabhas Anushka Shetty: ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు.
ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు. గాసిప్స్ అనేవి వస్తూనే ఉంటాయి.. పైగా మూడు సినిమాలు కలిసి చేసారు.. ఐదేళ్లు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేసారు కాబట్టి ఇవన్నీ కామన్ అంటున్నారు వాళ్లు. కానీ రోజురోజుకీ ఈ వార్తలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. దాంతో ప్రతీసారి ఎవరికి వాళ్లు దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రభాస్ కూడా సాహో టైమ్‌లో తనకు అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి బయటపడ్డాడు. ప్రభాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుందనే వార్తలున్నాయి. దీనిపై అటు ప్రభాస్.. ఇటు అనుష్క నో అనే సమాధానాలే చెప్పారు. అప్పట్లో సాహో ప్రమోషన్ కోసం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కతో మీకు రిలేషన్ ఉందా.. డేటింగ్ చేస్తున్నారా అని అడిగితే మొహమాటం లేకుండా లేదని చెప్పాడు ప్రభాస్. అసలు తాము ప్రేమలో ఉన్నట్లు ఎవరు చెప్పారంటూ మీడియానే ప్రశ్నించాడు ప్రభాస్. ఎక్కడైనా కలిసి కనిపించామా.. అసలు అనుష్కను కలిసి రెండేళ్లవుతుందని చెప్పి సంచలనం రేపాడు ఈ హీరో.
ప్రభాస్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటోస్ (Prabhas Anushka Shetty)
తనతో రిలేషన్ అనేది పూర్తిగా అబద్ధమని కొట్టి పారేసాడు. అసలు తనకు అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఈ హీరో. అయినా కూడా వీళ్ల మధ్య రూమర్స్ ఆగడం లేదు. అప్పట్లో తనకు ప్రభాస్ లాంటి అల్లుడు కావాలంటూ అనుష్క తల్లి సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు అనుష్కలో ప్రభాస్ మెచ్చుకునే గుణం ఏంటో బయటికి వచ్చింది. స్వీటీ గురించి ప్రభాస్‌కు దాదాపు అంతా తెలుసు. సినిమాలకు మించిన అనుబంధం అయితే కచ్చితంగా వీళ్ల మధ్య ఉంది. ఆ పరిచయంతోనే అనుష్కలోని ఆ క్వాలిటీ మెచ్చుకుంటున్నాడు ప్రభాస్.
ప్రభాస్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటోస్ (Prabhas Anushka Shetty)
అదేంటో తెలుసా.. మనిషిని మనిషిలా చూడటం. అవును.. ఇండస్ట్రీలో చాలా మంది సాటి మనుషులను కనీసం మనుషులుగా చూడటం కూడా ఎప్పుడో మరిచిపోయారు. కానీ అనుష్క మాత్రం లైట్ బాయ్ నుంచి చిన్న ప్రొడక్షన్ అసిస్టెంట్ వరకు అందరితోనూ ఒకేలా మాట్లాడుతుంది. దర్శకుడు, హీరోతో ఎలా ఉంటుందో.. సెట్లో అడుగు పెట్టిన తర్వాత ప్రతీ ఒక్కరితోనూ అలాగే ఉంటుంది. అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత. ఇదే విషయాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు కూడా తెలిపారు. ఇదే క్వాలిటీ ప్రభాస్‌కు కూడా చాలా బాగా నచ్చుతుందని తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.