బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హీరోగా ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. కేవలం హిందీలోనే ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసి అందిరీని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ముగ్గురు నలుగురు దర్శకులను లైన్లో పెట్టారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకె చెప్పిన ప్రభాస్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక మూవీకి ఓకే చెప్పినట్టు సమాచరాం. దాంతో పాటు ప్రభాస్.. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్ చెప్పిన లైన్ నచ్చి స్టోరీ డెవలప్ చేయమని చెప్పాడట. దాంతో పాటు మాటల మాంత్రికునితో కూడా లైన్లో పెట్టాడట. ఈ దర్శకులతో పాటు రాజమౌళి దర్శకత్వంలో హీరో మహేష్ బాబుతో చేయబోయే మల్టీస్టారర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ప్రభాస్‌తో వెంకీ కుడుముల (Twitter/Photo)
తాజాగా ప్రభాస్.. నితిన్‌తో ‘భీష్మ’ వంటి ఎంటర్టైన్మెంట్ తీసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రీసెంట్గా వెంకీ కుడుముల ప్రభాస్‌ను కలిసి తన దగ్గర ఉన్న ఒకస్టోరీ లైన్ చెప్పాడట. దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టేనర్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పూర్తి మాస్, తాజాగా చేస్తున్నది లవ్ స్టోరీ కాబట్టి.. వీటి మధ్యలో వెంకీ కుడుముల దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్టేనర్ చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడట. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాను ముఖ్యపాత్రలో తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో ‘హేరా ఫేరి’,‘గోల్మాల్’ సిరీస్ లెవల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాలనే ప్లాన్‌లో ఉన్నాడట.మొత్తానికి ప్రభాస్..కూడా యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీలు చేసి బోర్ కొట్టినట్టు ఉంది. అందుకే ఇపుడు పూర్తి కామెడీ ఎంటర్టేనర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 25, 2020, 13:08 IST