Home /News /movies /

PRABHAS LATEST PAN INDIA MOVIE RADHE SHAYM PRODUCERS SPENTS HEAVILY FOR TRAIN SET MHN

Prabhas - Radhe Shyam: ‘రాధేశ్యామ్’ ట్రైన్ సెట్ కోసం పెట్టిన ఖర్చేంతో తెలుసా..!

Prabhas latest pan india movie Radhe Shaym producers spents heavily for train set

Prabhas latest pan india movie Radhe Shaym producers spents heavily for train set

Prabhas - Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ గ్లింప్స్‌లో కనిపించే ట్రైన్ సెట్ కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో ఎందుకు సెట్ వేశారు.. ఎంత ఖర్చు పెట్టారనే వివరాలు మీకోసం...

    రెబల్‌స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఒక‌వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూనే ఉన్నా కూడా ఫైన‌ల్ లెగ్ షూట్‌ను యూనిట్ పూర్తి చేసుకునే ప‌నిలో ఉంది. ప్ర‌భాస్‌కున్న ప్యాన్ ఇండియా ఇమేజ్‌తో నిర్మాత‌లు భారీగానే ఖ‌ర్చు పెట్టారు. పీరియాడిక్ ల‌వ్‌స్టోరి కావ‌డంతో ప్ర‌భాస్ లుక్‌, స్టైల్‌, సినిమా లుక్ అన్నీ డిఫ‌రెంట్‌గా ఉండాలి కాబ‌ట్టి ప్ర‌తి విష‌యంలోనూ నిర్మాత‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ‌చ్చారు. సినిమాలో ప్ర‌భాస్ కాస్ట్యూమ్స్ కోసం ఆరేడు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు స‌మాచారం. కాగా.. ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో సెట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

    అదేంటంటే.. రీసెంట్‌గా ‘రాధేశ్యామ్’ గ్లింప్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇందులో రైల్వే స్టేష‌న్ సీన్‌‌ను మ‌నం చూసుంటాం. ఈ సీన్‌లో క‌నిపించే రైల్వేస్టేష‌న్ సెట్ కోసం రూ.1.6కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ట నిర్మాత‌లు. నిజానికి ఈ సీన్‌ను ఇట‌లీలో చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. అయితే కోవిడ్ ప్ర‌భావంతో యూనిట్ విదేశాల‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో నిర్మాత‌లు హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలోనే భారీ ఖ‌ర్చుతో రైల్వే స్టేష‌న్ సెట్‌ను వేశార‌ట‌.

    ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద్ర ఆధ్వ‌ర్యంలో దాదాపు 250కు పైగా టీమ్ స‌భ్యులు ఈ సెట్‌ను వేయ‌డానికి అహ‌ర్నిశ‌లు కష్టపడ్డారు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌లైన గ్లింప్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. 23 మిలియ‌న్ పైగానే వ్యూస్ వ‌చ్చింది. జూలై 30న ‘రాధేశ్యామ్’ సినిమా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.
    Published by:Anil
    First published:

    Tags: Prabhas, Radha Krishna, Radhe Shyam, UV Creations

    తదుపరి వార్తలు