Prabhas Salaar: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సలార్ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురు చూస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
ఇటీవలే రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. దీంతో కాస్త నిరాశ చెందిన ఆయన ఫ్యాన్స్.. ప్రభాస్ తదుపరి సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలు రీచ్ అయ్యేలా ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆయా సినిమా షూటింగుల్లో భాగమవుతున్నారు ప్రభాస్. ఈ లిస్టులో ఉన్న భారీ సినిమా సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురు చూస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
హై ఓల్టేజ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుంచాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. ఇప్పటికే విడుదల చేసిన సలార్ అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ సినిమా టీజర్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే చివరి వారంలోనే ఈ టీజర్ రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం కావడంలో కాస్త లేట్ అయింది. రిలీజ్‌కి చాలా నెలల ముందు టీజర్ వదలడం సరైనది కాదని ప్రశాంత్ నీల్ జాప్యం చేశారట.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌కు (Salaar Teaser) సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. జులై రెండో వారంలో ఈ టీజర్ విడుదల కాబోతోందని, దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. చిత్రంలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ని ఈ టీజర్లో హైలైట్ చేయబోతున్నట్లు సమాచారం. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు.
దీంతో పాటు మరో భారీ సినిమా ఆదిపురుష్ (Adipurush) చేస్తున్నారు ప్రభాస్. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. జనవరి 12వ తేదీ 2023 సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మరోవైపు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్లో పెట్టారు ప్రభాస్.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.