Prabhas - Radhe Shyam: ‘సాహో’ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ధాటికి ఒక మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. అన్ని కుదిరితే.. ఈ నెల 30న ఈ సినిమాను విడుదల అయ్యేది. కరోనా ఈ సినిమా విడుదల తేదిపై నీళ్లు చల్లింది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ‘రాధే శ్యామ్’ సినిమా కోసం ‘ఛత్రపతి’ సెంటిమెంట్ ఫాలో కావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఏ ఇండస్ట్రీలోనైనా సెంటిమెంట్లు ఉంటాయో.. ఉండవో కానీ.. సినీ ఇండస్ట్రీలో మాత్రం తుమ్మితే...దగ్గితే.. అన్నింటికి సెంటిమెంట్స్‌ను గుడ్డిగా ఫాలో అవుతుంటారు. తాాజాగా ‘రాధే శ్యామ్’ సినిమాను ‘ఛత్రపతి’ సినిమా విడుదలైన సెప్టెంబర్ 30న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆ డేట్ అయితే.. సెంటిమెంట్‌గా వర్కౌట్ అవడమే కాకుండా.. ఏ సినిమా కూడా పోటీలో ఉండదు. అందుకే ఆ డేట్‌ను లాక్ చేసినట్టు చెబుతున్నారు.
దాదాపు పూర్తి కావొచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాకు మరో రెండు వారాల ప్యాచ్ షూటింగ్ వర్క్ మాత్రమే మిగిలిపోయింది. ఇప్పటికే పూజా హెగ్డేకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమాను ఈ నెల 22 నుంచి ఆగష్టు ఫస్ట్ వారం వరకు చేస్తే షూటింగ్ కంప్లీట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భాగాన్ని ఎడిటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయ్యాయి.
ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఐతే ఫైనల్ గా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అయ్యినట్టు తాజా సమాచారం. ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిస్తోంది.
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమా పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడరు. ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది. మరో హీరోయిన్గా వాణీ కపూర్ నటిస్తోంది. దాంతో పాటు ప్రభాస్ పలు క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్లో పెట్టినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radha Krishna Kumar, Radhe Shyam, Tollywood, UV Creations