హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్‌ను లోకేష్, బ్రాహ్మాణి ఫోటోతో కంపేర్ చేస్తోన్న నెటిజన్స్..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్‌ను లోకేష్, బ్రాహ్మాణి ఫోటోతో కంపేర్ చేస్తోన్న నెటిజన్స్..

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పోస్టర్‌ను నారా బ్రాహ్మణి,లోకేష్ ఫోటోతో కంపేర్ చేస్తోన్న నెటిజన్లు (Twitter/Photo)

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పోస్టర్‌ను నారా బ్రాహ్మణి,లోకేష్ ఫోటోతో కంపేర్ చేస్తోన్న నెటిజన్లు (Twitter/Photo)

‘సాహో’ తర్వాత ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ కన్ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొంత మంది నారా లోకేష్, బ్రాహ్మణిల ఫోటోతో కంపేర్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

‘సాహో’ తర్వాత ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ కన్ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ప్రభాస్, పూజా హెగ్డేలు ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. . ఈ రోజు బాహుబలి .. ఫస్ట్ పార్ట్ రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్.. సరైన సందర్భం అనుకోని మరి  ‘రాధే శ్యామ్’ టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.  తాజాగా ఈసినిమా పోస్టర్‌ను కొంత మంది నెటిజన్లు.. నారా లోకేష్, బ్రాహ్మాణిలు దిగిన ఫోటోతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.  నారా లోకేష్, బ్రాహ్మణిలు ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఈ లుక్‌కు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫోటోను ప్రభాస్, పూజా హెగ్డేల ‘రాధే శ్యామ్’ ఫోటోతో కంపేర్ చేస్తూ ఒక ఫోటోను విడుదల చేసారు. లోకేష్, బ్రాహ్మణిల లుక్‌ను ప్రభాస్ సినిమా కోసం వాడుకున్నారంటూ ఫన్నిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్, పూజా హెగ్డేల ఈ లుక్‌ ఎన్నో సినిమాల్లో ఉంది. తాజాగా ‘రాధే శ్యామ్’ సినిమా కోసం మూవీ మేకర్స్ ఈ లుక్‌ను ఫైనల్ చేసారు.

First published:

Tags: Bollywood, Nara Brahmani, Nara Lokesh, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

ఉత్తమ కథలు