అభిమానులకు కాస్త ఆలస్యంగా ప్రభాస్ సంక్రాంతి గిఫ్ట్...

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైన ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో లేట్‌గా అయినా.. లెటేస్ట్‌గా సంక్రాంతి బహుమతి ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు.

news18-telugu
Updated: January 17, 2020, 3:17 PM IST
అభిమానులకు కాస్త ఆలస్యంగా ప్రభాస్ సంక్రాంతి గిఫ్ట్...
ప్రభాస్ కొత్త సినిమా లుక్ (Intstagram/Photo)
  • Share this:
బాహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్.. గతేడాది ‘సాహో’ సినిమాతో పలకరించాడు. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా హిందీలో మాత్రం మంచి విజయాన్నే అందుకుంది. తెలుగు ఇతర భాషల్లో ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైన ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ సంక్రాంతికి ప్రభాస్ ఏదైనా గిఫ్ట్ ఇస్తాడనుకుంటే నిరాశ  పరిచాడు. దీంతో లేట్‌గా అయినా.. లెటేస్ట్‌గా సంక్రాంతి బహుమతి ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు ప్రభాస్. పురాతమైన పెద్ద హాల్‌లో పియానో పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేసాడు. ఈ ఫోటోను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.



ఈ సినిమా విషయానికొస్తే.. 1970, 80 బ్యాక్ డ్రాప్‌లో యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్నారు. హీరోగా ప్రభాస్‌కు ఇది 20వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో సంయుక్తంగా తెరకెక్కుతోంది.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు